అక్షరటుడే, ఆర్మూర్: Sriram sagar | తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి (Sriramsagar project) వరద తగ్గుముఖం పట్టడంతో గేట్లను సోమవారం మధ్యాహ్నం మూసివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 29,907క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరింది. సోమవారం ఉదయం 4వరద గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలిన అధికారులు మధ్యాహ్నానికి మూసివేశారు.
Sriram sagar | కాలువల ద్వారా నీటి విడుదల
ప్రాజెక్టు ఎస్కేప్ గేట్ల ద్వారా 4,500 క్యూసెక్కులు, కాకతీయ కాలువ (Kakatiya canal) ద్వారా 3,500 క్యూసెక్కుల వరదనీటిని వదులుతున్నారు. అలాగే వరద కాలువ ద్వారా 20వేల క్యూసెక్కులు, లక్ష్మీ కాలువ ద్వారా 150క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 500 క్యూసెక్కులు, అలీసాగర్ ఎత్తిపోతలకు 360క్యూసెక్కులు, మిషన్ భగీరథకు (Mission Bhagiratha) 231క్యూసెక్కులు వదులుతున్నారు. 666 క్యూసెక్కుల నీరు ఆవిరిగా పోతోంది. మొత్తంగా 29,907 క్యూసెక్కుల నీటిని కాలువ ద్వారా వదులుతున్నారు.
Sriram sagar | గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలు..
అలాగే ప్రాజెక్టు నిండుగా ఉండడంతో ఎప్పుడైనా దిగువకు మళ్లీ నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుందని ప్రాజెక్టు ఏఈఈ కొత్తరవి (project AEE Kotharavi) పేర్కొన్నారు. ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వరదు వచ్చే అవకాశాలున్నాయని సైతం హెచ్చరించారు. కావున గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 80.5 టీఎంసీలు (1091 అడుగులు) కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 80.053 టీఎంసీలు(1090.90అడుగులు)లకు చేరింది.