అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sriram Sagar reservoir : ఉత్తర తెలంగాణ (Telangana) వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ జలాశయాని(Sriram Sagar project)కి వరద తగ్గుముఖం పట్టింది.
దీంతో శనివారం (ఆగస్టు 23) ఎనిమిది గేట్లు మూసివేశారు. ఇప్పటి వరకు 16 గేట్లు తెరిచి వరద నీటిని దిగువ గోదావరి నది(Godavari river)లోకి వదిలారు.
శనివారం రాత్రి 8 గేట్లు ముసివేయడంతో.. మిగతా ఎనిమిది గేట్ల ద్వారా వరద నీటిని కిందికి వదులుతున్నారు.
ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటిమట్టం 1091 (80.5 టీఎంసీలు) అడుగులు కాగా.. ప్రస్తుతం 1090.7 (79.2టీఎంసీల) అడుగుల మేర నీరు నిల్వ ఉంది.
వరద గేట్ల (Flood Gates) ద్వారా ఇప్పటి వరకు 49,280 క్యూసెక్కులు గోదావరి (Godavari)లోకి వదలగా.. ప్రస్తుతం సగానికి తగ్గించారు.
Sriram Sagar | కాలువల ద్వారా
శ్రీరామ్‌సాగర్ నుంచి కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. ప్రాజెక్ట్ కింద లక్షల ఎకరాల్లో పంటలు సాగు అవుతుండగా.. ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్నారు.
జలాశయం ఎస్కేప్ గేట్ల ద్వారా 4,500 క్యూసెక్కులు, కాకతీయ ప్రధాన కాలువ (Kakatiya Canal)కు 3,500, వరద కాలువకు 20వేలు, లక్ష్మి కాలువకు 150, సరస్వతి కాలువకు 500 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు.
మిషన్ భగీరథకు 231క్యూసెక్కులు వదులుతుండగా, 651క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో పోతోంది. ప్రాజెక్ట్ నుంచి 78,812 క్యూసెక్కుల ఔట్ ఫ్లో నమోదు అవుతోంది.
Sriram Sagar | మిడ్‌మానేరుకు జలకళ
వరద కాలువ (Flood Canal) ద్వారా నీటి విడుదల కొనసాగతుండగటంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు (Mid Manair) జలకళను సంతరించికుంది.
గాయత్రి పంప్ హౌస్ నుంచి 3,150 క్యూసెక్కులు మిడ్ మానేరులోకి ఎత్తిపోతుస్తున్నారు. దీంతో జలాశయం నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 25 టీఎంసీలు కాగా ప్రస్తుతం 17 టీఎంసీలు దాటింది.