అక్షరటుడే, ఆర్మూర్: Sriram Sagar | ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్ (Sriram Sagar) ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో తగ్గింది. వరుసగా కురిసిన వర్షాలతో మంగళవారం (Mangalaram) వరకు ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద వచ్చింది. మంగళవారం ఉదయం 6 గంటలకు వరకు 89,812 క్యూసెక్కుల వరద రాగా.. 9 గంటలకు లక్షా 5వేలకు పెరిగింది. కాగా బుధవారం ఉదయం 6 గంటలకు 55,577 క్యూసెక్కులకు ఇన్‌ఫ్లో పడిపోయింది. 9 గంటల సమయానికి 15,276 క్యూసెక్కుల వరద వస్తోంది.
Sriram Sagar | క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం
రెండు రోజుల పాటు ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద రావడంతో నీటిమట్టం పెరిగింది. అయితే ప్రస్తుతం ఇన్‌ఫ్లో (Inflow) తగ్గడంతో నీటమట్టం క్రమంగా పెరుగుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 1077.10 (37.632 టీఎంసీలు) అడుగుల నీరు ఉంది. ఎగువన మహారాష్ట్ర, స్థానికంగా కురిసన వర్షాలతో ప్రాజెక్ట్‌లోకి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది.
జలాశయం నుంచి కాకతీయ ప్రధాన కాలువకు (Kakatiya Main Canal) 100 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఆవిరి రూపంలో 407 క్యూసెక్కులు పోతోంది. జలాశయంలోకి మూడు రోజుల వ్యవధిలో 14 టీఎంసీల వరద నీరు వచ్చింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.