అక్షరటుడే, మెండోరా: Sriram Sagar Gates Lifted : ఉత్తర తెలంగాణ వరదాయిని శ్రీరామ్ సాగర్ జలాశయంలోకి ఇన్ఫ్లో కొనసాగుతోంది.
ఎగువ ప్రాంతం నుంచి 37,840 క్యూసెక్కుల వరద వస్తోంది. భారీగా చేరిన వెనుక జలాలతో శ్రీరాంసాగర్ జలాశయం చిన్నపాటి సముద్రాన్ని తలపిస్తోంది.
ఇక వరద నేపథ్యంలో ఆదివారం (సెప్టెంబరు 7) రాత్రి నీటి విడుదలను ప్రారంభించారు. ఎనిమిది వరద గేట్లు ఎత్తి 12,500 క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి వదులుతున్నారు.
Sriram Sagar Gates Lifted : కాలువల ద్వారా..
ఇక వరద కాలువ ద్వారా 19,000 క్యూసెక్కులు, కాకతీయ Kakatiya కాలువ నుంచి 5,500 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 2,500 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు, గుప్తా ఎత్తిపోతల Gupta lift irrigation scheme పథకానికి 270 క్యూసెక్కులు వదులుతున్నారు.
ఇక ఆవిరి రూపంలో 666 క్యూసెక్కులు పోతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.501 టీఎంసీ) అడుగులు కాగా.. పూర్తిస్థాయి నీటి మట్టంతో ప్రాజెక్టు నిండుకుండలా కళకళలాడుతోంది.