అక్షరటుడే, వెబ్‌డెస్క్: Srilanka beat Bangladesh | ఆసియా కప్ – 2025 టోర్నమెంట్ (Asia Cup 2025 tournament) లో శ్రీలంక Srilanka శుభారంభం చేసింది. శనివారం (సెప్టెంబరు 13) బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో రాణించిన లంక జట్టు.. 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
బౌలింగ్‌లో వానిందు హసరంగా, బ్యాటింగ్‌లో పాతుమ్ నిస్సంక ఆకట్టుకున్నారు. మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది.
జాకెర్ అలీ 34 బంతుల్లో 41 పరుగులు చేయగా, షమీమ్ హొస్సేన్ 34 బంతుల్లో 42 పరుగులతో అజేయంగా నిలిచాడు. శ్రీలంక బౌలింగ్‌లో హసరంగా Hasaranga 2 వికెట్లు తీసి ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
నువాన్ తుషారా, దుష్మంత్ చమీరా చెరో వికెట్ తీశారు. హసరంగా తన స్పెల్‌లో బంగ్లా కెప్టెన్ లిటన్ దాస్ (28) , మెహదీ హసన్ (9)లను అవుట్ చేసి మ్యాచ్‌ని మలుపు తిప్పాడు.
Srilanka beat Bangladesh | మలుపు తిప్పారు…
140 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 14.4 ఓవర్లలోనే విజయ లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ పాతుమ్ నిస్సంక 34 బంతుల్లో 50 పరుగులు చేయగా.. కమిల్ మిషార 32 బంతుల్లో 46 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలుపు దిశగా నడిపించాడు.
ఈ ఇద్దరి భాగస్వామ్యం వలన లంక జట్టు లక్ష్యాన్ని 32 బంతులు మిగిలి ఉండగానే చేరుకుంది. బంగ్లాదేశ్ Bangladesh బౌలర్లలో మెహదీ హసన్ 2 వికెట్లు తీశాడు. ముస్తాఫిజుర్ రెహ్మాన్, తంజిమ్ హసన్ షకీబ్ చెరో వికెట్ తీశారు.
ఈ గెలుపుతో శ్రీలంక గ్రూప్ స్టేజ్‌లో విలువైన పాయింట్స్ సాధించగా, టీమ్ ఫార్మ్ పట్ల అభిమానుల్లో నమ్మకాన్ని నెలకొల్పింది. తదుపరి మ్యాచ్‌లలో కూడా ఇదే రీతిలో ప్రదర్శన కొనసాగించాలనే దిశగా లంక జట్టు ముందుకు సాగుతోంది.
ఇక మరి కొద్ది గంటలలో హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తొలిసారి భారత్ India – పాకిస్తాన్ Pakistan జట్లు తలపడబోతున్నాయి. ఈ రెండు జట్ల మధ్య పోటీ ఆసక్తికరంగా ఉండనుంది.
గెలుపు కోసం రెండు జట్లు తీవ్రంగా కృషి చేయడం ఖాయం. ఈ గెలుపు రెండు టీమ్స్ చాలా ప్రస్టేజీయస్‌గా తీసుకుంటున్నాయి. రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.