అక్షరటుడే, వెబ్డెస్క్: SriLanka | శ్రీలంక సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు parliament సభ్యుల పెన్షన్ల pensions ను రద్దు చేసింది. పార్లమెంట్లో మంగళవారం ఇందుకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందింది. 225 మంది సభ్యులు ఉన్న శ్రీలంక పార్లమెంటులో 154 మంది సదరు బిల్లు Bill ను సమ్మతిస్తూ ఓటేయడం గమనార్హం. కేవలం ఇద్దరు సభ్యులు మాత్రమే బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. మిగతావారు ఈ బిల్లు ఓటింగ్లో పాల్గొనలేదు.
శ్రీలంక దేశంలో ఐదు సంవత్సరాలు ఎంపీ MP ఉన్న వారికి పెన్షన్ అందుతోంది. కాగా, కొత్త చట్టం ఆమోదం వల్ల ఇప్పటికే పెన్షన్ అందుకుంటున్న వారితో పాటు, కొత్త వారికి కూడా ఇకపై పెన్షన్ అందదు. మాజీ అధ్యక్షులకు ఇచ్చే ప్రయోజనాలను ఇప్పటికే దిసనాయకే సర్కారు ఆపేసింది. ఇంటి బాడుగ, అలవెన్సులు, పెన్షన్లు, రవాణా భత్యం, సౌకర్యాలను 2025 సెప్టెంబర్లోనే రద్దు చేయడం గమనార్హం.
SriLanka | కుదేలైన పర్యాటక రంగంతో..
పర్యాటక రంగంపై ఆధారపడిన శ్రీలంకలో కొవిడ్, ఉగ్రవాద దాడులతో పర్యాటకుల (విదేశీయుల) రాకపోకలు తగ్గాయి. దీనికితోడు పాలకుల ఆర్థిక నిర్వహణ అసమర్థత వల్ల. 2022లో దివాళా తీసింది. ఈ క్రమంలో ప్రజలు తిరగబడటంతో అప్పటి అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేశారు.
అనంతరం ఎన్నికలు నిర్వహించగా.. మార్క్సిస్టు నాయకుడు దిసనాయకే గెలుపొంది అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టేందుకు పాలకుల పెన్షన్ల రద్దు బిల్లును ప్రవేశపెట్టారు. దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు చట్టసభ సభ్యులకు పెన్షన్లు తీసుకోవడం సరికాదంటూ ఈ చర్చ సందర్భంగా న్యాయ శాఖ మంత్రి హర్షణ నానాయక్కర స్పష్టం చేశారు.