Homeజిల్లాలునిజామాబాద్​Bodhan | ‘మన్మథ స్వామి’ పాదయాత్ర ప్రారంభం

Bodhan | ‘మన్మథ స్వామి’ పాదయాత్ర ప్రారంభం

బోధన్​ పట్టణంలోని జంగంగల్లిలో పురాణే (పౌడయ్య) మఠం ఆధ్వర్యంలో శ్రీక్షేత్ర కపిలధార మన్మథ స్వామి పాదయాత్ర గురువారం ప్రారంభమైంది. భక్తులు ఉదయమే పాదయాత్రగా బయలుదేరారు.

- Advertisement -

అక్షరటుడే, బోధన్: Bodhan | పట్టణంలోని జంగంగల్లిలో పురాణే (పౌడయ్య) మఠం ఆధ్వర్యంలో శ్రీక్షేత్ర కపిలధార మన్మథ స్వామి 16వ పాదయాత్ర (Padayatra) గురువారం ప్రారంభమైంది. వీరశైవ జంగమ లింగాయత్​ల సహకారంతో.. గురువారం ఈ యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరశైవ లింగాయత్ రాష్ట్ర సభ్యులు శ్యాంరావు, కార్యక్రమ నిర్వాహకులు పురానే అజయ్ కుమార్ మాట్లాడుతూ కార్తీక మాసం వీరశైవులకు చాలా విశిష్టమైనదన్నారు.

ఈ యాత్ర నవంబర్ 5న కార్తీక పౌర్ణమి (Karthika Pournami) నాటికి 15 రోజుల పాటు సాగుతుందన్నారు. యాత్రకు గ్రామగ్రామాన భజనలు, కీర్తనలు, మంగళ హారతులతో ప్రజలు స్వాగతం పలుకనున్నారన్నారు. మహారాష్ట్ర బీడ్ జిల్లా మంజర్ సొంబ గ్రామంలోని కపిలధార జలపాతంలో (Kapiladhara waterfall) పుణ్యస్నానం చేసి, మన్మథ స్వామి జిత్త స్మారక దర్శనంతో యాత్ర ముగుస్తుందని వివరించారు. కార్యక్రమంలో వీరశైవ జంగమ లింగాయత్​ ప్రముఖులు, భజన మండలి సభ్యులు, జంగంగల్లి కాలనీవాసులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

యాత్ర బోధన్ నుంచి స్థానిక ఎల్లమ్మ మందిరం, శివాలయంలో విశేష పూజలు నిర్వహించిన అనంతరం హెడ్​పోస్టాఫీస్​, నాగన్​పల్లి, సాలూర క్యాంప్ సాలురా, ఖాజాపూర్, కొల్లూరు మీదుగా సుంకిని చేరుకుంటుంది. మరుసటి రోజు ఉదయం నుంచి 15 రోజులపాటు ఈ యాత్ర కొనసాగనుంది.