అక్షరటుడే, వెబ్‌డెస్క్ : MEO Bribery Case | లంచం తీసుకుంటూ ఓ ఎంఈవో ఏసీబీకి చిక్కాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో చోటు చేసుకుంది.
రాష్ట్రం ఏదైనా అవినీతి అధికారులు మారడం లేదు. తమ వద్దకు పనుల కోసం వచ్చే వారిని లంచాల కోసం వేధిస్తున్నారు. తోటి ఉద్యోగులను సైతం వదలడం లేదు. ప్రతి పనికి ఓ రేటు కడుతున్నారు. పైసులు ఇస్తేనే పనులు చేస్తున్నారు. లేదంటే కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం (Ichapuram)లో లంచం తీసుకుంటూ ఎంఈఓ కూరమాన అప్పారావు ఏసీబీకి చిక్కాడు. రిటైర్డ్ అయిన ఉపాధ్యాయుడి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణలో సైతం ఇటీవల ఏసీబీ కేసులు పెరిగాయి. పెద్దపల్లి (Peddapalli) జిల్లా మంథని సబ్ రిజిస్ట్రార్ (Sub-Registrar) కాసర్ల రాజేందర్‌ను మూడు రోజుల క్రితం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఫిర్యాదుదారుడు కొనుగోలు చేసిన భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు గాను ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ రషీద్ ద్వారా రూ.16,500 లంచం తీసుకుంటుంగా.. వల పన్ని పట్టుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి (Jayashankar Bhupalapally) జిల్లా ప్రధాన, సెషన్స్ కోర్టులో స్టెనో గ్రేడ్-1గా పనిచేస్తున్న పాలకుర్తి సాయి చరణ్ నాలుగు రోజుల క్రితం ఏసీబీకి చిక్కాడు. అయితే ఏసీబీ కేసులు నమోదు అవుతున్నా.. లంచాలకు మరిగిన అధికారులు భయపడటం లేదు.
