అక్షరటుడే, కామారెడ్డి : Sriharikota | నెల్లూరులోని శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ (Satish Dhawan Space Research Center) పర్యటనకు జిల్లాలో పదోతరగతి చదువుతున్న 50మంది విద్యార్థినులు వెళ్తున్నట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Sriharikota | ఎంపిక పరీక్ష ద్వారా..
గత ఏడాది అక్టోబర్‌లో నిర్వహించిన ఎంపిక పరీక్ష ద్వారా ప్రతిభావంతులైన 50 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్టు కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా సైన్స్ అధికారి (District Science Officer) సిద్దిరాంరెడ్డి పర్యవేక్షణలో ఎంపికైన విద్యార్థినులు ఈనెల 28న వెళ్తున్నారన్నారు. విద్యార్థులతో పాటు 30 మంది ఉపాధ్యాయులు కూడా పర్యటనలో పాల్గొననున్నారని తెలిపారు.
Sriharikota | శాస్త్ర సాంకేతిక రంగాలపై అవగాహన..
విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక రంగాలపై అవగాహన, ఆసక్తి పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ పర్యటనకు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ అవకాశం కల్పించారని, పర్యటనలో భాగంగా విద్యార్థులకు అవసరమైన రవాణా, భోజన వసతులు పూర్తిగా ఉచితంగా కల్పించబడుతున్నాయని వెల్లడించారు. ఈ నెల 29న ఇస్రోలోని లాంచింగ్ ప్యాడ్‌తో పాటు ఇతర విభాగాలను విద్యార్థులు సందర్శించనున్నారని పేర్కొన్నారు. అనంతరం 30వ తేదీన విద్యార్థులు కామారెడ్డి (Kamareddy)కి తిరిగి చేరుకుంటారని తెలిపారు.