అక్షరటుడే, బాన్సువాడ: Sri Chaitanya School | పట్టణంలో అనుమతులు లేకుండా కొనసాగుతున్న శ్రీ చైతన్య పాఠశాలపై (Sri Chaitanya School) అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం పాఠశాల ఎదుట విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఇన్ఛార్జిని ప్రశ్నించగా.. శ్రీ చైతన్య పాఠశాల కాదని, కేవలం ట్యూషన్ సెంటర్ అని సమాధానం ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండా తరగతులు కొనసాగిస్తున్న శ్రీ చైతన్య పాఠశాలను తక్షణమే విద్యాశాఖ అధికారులు సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఒక సంవత్సర కాలం భవిష్యత్ వృథా అవుతుందని చెప్పారు. ఇలాగే కొనసాగితే విద్యార్థి సంఘలు విద్యాశాఖ కార్యాలయాలను (education department offices) ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పీడీఎస్యూ(ఎస్) జిల్లా అధ్యక్షుడు బాల్ రాజ్, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకుడు పుట్ట భాస్కర్, టీఎస్ పీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్, సాయిబాబా, శివకుమార్, ఫాజిల్, అబ్దుల్ హాకీం, ప్రశాంత్, నిఖిల్, మేఘనాథ్, నవీన్, గణేష్, వేణు గౌడ్, రవీందర్ గౌడ్, మహేష్, జీవన్ పాల్గొన్నారు.