అక్షరటుడే వెబ్‌డెస్క్ : IPL 2025 | సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) ఆటగాళ్లు విజృంభిస్తే ఏ రేంజ్‌లో ఉంటుంది అనేది ఈ సీజన్ స్టార్టింగ్‌లోనే చూపించారు.
మధ్యలో కాస్త నెమ్మదించిన చివరలో మళ్లీ అదే ఊపు తెచ్చారు. ఆశించిన స్థాయిలో రాణించలేక ప్లే ఆఫ్స్ (play Offs) రేసు నుంచి నిష్క్రమించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తాజాగా రికార్డు స్కోర్లు చేయడంలో మాత్రం తమకు తామే సాటి అని మరోసారి నిరూపించుకుంది. ఆదివారం ఢిల్లీలో డిఫెండింగ్ చాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)తో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. 20 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 278 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ లీగ్‌లో ఇది మూడో అత్యధిక స్కోరు.
IPL 2025 | రికార్డులే రికార్డులు..
ఎస్‌ఆర్‌హెచ్ ఖాతాలో 287/3 పరుగులు హయ్యెస్ట్ కాగా, బెంగళూరుపై 2024లో చేసింది. ఆ తర్వాత 286/6 రాజస్థాన్ మీద, ఆ తర్వాత 278/3 కోల్‌కతాపై, ముంబై 277 పరుగులు సాధించింది. గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో క్లాసెన్ ఆకాశమే హద్దు అన్నట్టుగా చెలరేగి ఆడడంతో ఐపీఎల్ చరిత్రలో మూడో అత్యధిక స్కోరు ఎస్‌ఆర్‌హెచ్ ఖాతాలో నమోదైంది. మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. 20 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 278 పరుగుల భారీ స్కోరు చేసింది. హెన్రిచ్ క్లాసెన్( Klassen) (39 బంతుల్లో 105 నాటౌట్; 7 ఫోర్లు, 9 సిక్సర్లు) మెరుపు శతకానికి తోడు ట్రావిస్ హెడ్ (40 బంతుల్లో 76, 6 ఫోర్లు, 6 సిక్సర్లు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టారు.
కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోల్‌కతా.. 18.4 ఓవర్లలో 168 రన్స్‌కు ఆలౌటై 110 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మనీష్ పాండే (37), హర్షిత్ రానా (34*), సునీల్ నరైన్ (31) Narine కేకేఆర్ ఓటమి అంతరాన్ని తగ్గించారు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో ఉనద్కత్ (3/24), హర్ష్ దూబె (3/34) రాణించారు. సీజన్ మొత్తం నిరాశపరిచిన హైదరాబాద్ జట్టు చివరి మ్యాచ్‌లో మాత్రం ప్రేక్షకులకి మంచి మజా అందించింది. ఇదే జోష్‌ని కంటిన్యూ చేస్తూ నెక్ట్స్ సీజన్‌లో రాణించి కప్ కొట్టాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.