అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Heroine Srileela | టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తక్కువ కాలంలోనే ఈ భామ స్టార్ హీరోల సరసన వరుస సినిమా అవకాశాలు అందుకొని టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది.
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’, మాస్ మహారాజ్ రవితేజతో చేస్తున్న ‘మాస్ జాతర’ చిత్రాలతో బిజీగా ఉంది. రెండు చిత్రాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా షూటింగ్‌ల మధ్యలో శ్రీలీల (Heroine Srileela) పలు టీవీ షోలు, ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. తాజాగా.. ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది.
Heroine Srileela | పెళ్లిపై కామెంట్స్
తనకు కాబోయే భర్త ఎలా ఉండాలన్న ప్రశ్నకు శ్రీలీల స్పందిస్తూ.. “అతను అందంగా ఉండకపోయినా పర్వాలేదు. కానీ నన్ను అర్థం చేసుకునే వ్యక్తి అయి ఉండాలి. నా కెరీర్‌కు మద్దతుగా ఉండడంతో పాటు, నన్ను మంచిగా చూసుకోవాలి. నా పట్ల నిజాయితీగా ఉండి, సరదాగా, పాజిటివ్‌గా ఉండే వ్యక్తి కావాలి. అలాంటి వాడిని కలిస్తే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను” అని ఓపెన్‌గా చెప్పింది. శ్రీలీల ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతున్నాయి. “ఇలాంటి మంచి లక్షణాలు ఉన్న వ్యక్తి ఇప్పటి కాలంలో దొరుకుతాడా?” అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తుండగా.. మరికొందరు “ఇంత క్లారిటీ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అదృష్టం” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ మధ్య శ్రీలీల కెరీర్ చూస్తుంటే అంత సాఫీగా సాగుతున్నట్లు కనిపించడం లేదు. భగవంత్ కేసరి మినహాయిస్తే.. ఒక్కటంటే ఒక్క సినిమాలోనూ ఆమె పవర్‌ఫుల్ పాత్ర చేయలేదు. స్కంద, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్, రాబిన్‌హుడ్.. మొన్న జూనియర్.. వీటిలో ఏ సినిమా కూడా శ్రీలీల స్థాయిని పెంచలేకపోయాయి. తాను చేసిన 9 సినిమాల్లో.. పెళ్లి సందడి, ధమాకా, భగవంత్ కేసరి మాత్రమే హిట్టు కాగా.. గుంటూరు కారం ఓ మోస్తరు హిట్ అయింది. శివకార్తికేయన్ హీరోగా సుధా కొంగర తెరకెక్కిస్తున్న పరాశక్తితో తమిళంలోకి.. కార్తిక్ ఆర్యన్ సినిమాతో హిందీలోకి ఎంట్రీ ఇస్తున్న శ్రీలీల అక్కడైన మంచి హిట్ కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

