అక్షరటుడే, ఇందూరు: BJP Nizamabad | భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) రాష్ట్ర కార్యదర్శిగా గోపిడి స్రవంతి రెడ్డి (Gopidi Sravanthi Reddy) నియామకమయ్యారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు ఉత్తర్వులు జారీ చేశారు.
స్రవంతి రెడ్డి నగరపాలక సంస్థ లో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా, అధికార ప్రతినిధిగా పనిచేశారు. రాష్ట్ర కార్యవర్గంలో చోటు కల్పించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Arvind), జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారికి (Dinesh kulachari) ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.