ePaper
More
    HomeజాతీయంPakistan Spy | పాక్‌కు గూఢ‌చ‌ర్యం.. నేవీ ఉద్యోగి అరెస్టు

    Pakistan Spy | పాక్‌కు గూఢ‌చ‌ర్యం.. నేవీ ఉద్యోగి అరెస్టు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Pakistan Spy | పాకిస్తాన్‌కు గూఢ‌చార్యం చేస్తూ మ‌రో వ్య‌క్తి పోలీసులకు చిక్కాడు. నేవీలో క్ల‌ర్క్‌(Navy Clerk)గా ప‌ని చేస్తున్న విశాల్ యాద‌వ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని నావికాదళ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న అత‌డు.. దేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని పాక్ హ్యాండ్లర్‌(Pak handler)కు అందజేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ నేప‌థ్యంలోనే అత‌డ్ని అదుపులోకి తీసుకున్న రాజస్థాన్‌ ఇంటెలిజెన్స్(Rajasthan Intelligence) విభాగం ర‌హ‌స్యంగా విచారిస్తోంది.

    Pakistan Spy | వ‌ల‌పు వ‌ల విసిరి..

    నేవీ ప్ర‌ధాన కార్యాల‌యంలో ప‌ని చేస్తున్న విశాల్ యాద‌వ్‌పై వ‌ల‌పు వ‌ల విసిరిన పాకిస్తాన్‌.. ఆయ‌న నుంచి ర‌హ‌స్య స‌మాచారం(Confidential information) సేక‌రిస్తున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన ఓ మహిళా హ్యాండ్లర్‌తో విశాల్ టచ్‌లో ఉండేవాడు. ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసైన అతడు నష్టాలు మూటగట్టుకున్నాడు. ఆ డ‌బ్బును తిరిగి సంపాదించేందుకు యాద‌వ్ అడ్డదారులు తొక్కాడని పోలీసులు తెలిపారు. పాక్ తరపున గూఢచర్యం చేసినందుకు అతడికి క్రిప్టో కరెన్సీ(Cryptocurrency)లో చెల్లింపులతో పాటు నేరుగా బ్యాంక్‌ అకౌంట్‌కు నగదు బదిలీ అయ్యేదన్నారు. ఆప‌రేష‌న్ సింధూర్ త‌ర్వాత పాకిస్తాన్ ఇండియాలో గూఢ‌చర్య కార్య‌క్ర‌మాల‌ను విస్తృతం చేసింది.

    ఈ నేప‌థ్యంలో భారత్‌లో పాక్ నిఘా వర్గాల కార్యకలాపాలను జాగ్రత్తగా గమనిస్తున్నామని, ఈ క్ర‌మంలోనే విశాల్ యాద‌వ్ త‌మ దృష్టిలోకి వ‌చ్చాడ‌ని ఇంటెలిజెన్స్ విభాగం సీనియర్ పోలీసు అధికారి విష్ణుకాంత్ గుప్తా(Vishnukant Gupta) తెలిపారు. పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన ఓ మహిళా హ్యాండ్లర్ వ‌ల‌పు వ‌ల‌లో చిక్కుకున్నాడు. ప్రియా శర్మగాగా త‌న‌ను తాను ప‌రిచ‌యం చేసుకున్న ఆమె అత‌డ్ని బుట్ట‌లో వేసుకుంది. ఈ క్ర‌మంలోనే అత‌డు కీల‌క‌మైన స‌మాచారాన్ని ఆమెకు చేర‌వేశాడ‌న్నారు. నావికాదళ కార్యకలాపాలు, ఇతర రక్షణ సంస్థలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని అందించార‌ని గుర్తించారు. ఇలా గూఢచర్యం చేసినందుకు అతడికి క్రిప్టో కరెన్సీలో చెల్లింపులు చేసేవార‌ని, నేరుగా బ్యాంక్‌ అకౌంట్‌కు నగదు బదిలీ అయ్యేదని చెప్పారు.

    Pakistan Spy | మ‌రింత లోతుగా విశ్లేష‌ణ‌..

    ఈ రాకెట్‌లో ఎవరెవరు ఉన్నారో, ఎలాంటి సమాచారం లీకైందో తెలుసుకునేందుకు సెక్యూరిటీ ఏజెన్సీలు(Security agencies) ప్రయత్నిస్తున్నాయి. ఈ అరెస్టు నేపథ్యంలో సోషల్ మీడియా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. భారత్‌పై కన్నేసేందుకు పాక్ ఏజెన్సీలకు ఇది ప్రధాన మాధ్యమంగా మారిన వైనం ఆందోళన కలిగిస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఎలాంటి అనుమానాస్పద యాక్టివిటీ కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సెక్యూరిటీ ఏజెన్సీలు సూచించాయి.

    More like this

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...

    Moneylaundering Case | మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. అక్ర‌మ ఖ‌నిజం త‌ర‌లింపు కేసులో..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Moneylaundering Case | క‌ర్ణాట‌క‌కు చెందిన మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ బుధ‌వారం...

    Thar SUV | నిమ్మకాయని తొక్కించ‌బోయి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిన కొత్త‌ కారు .. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ యువ‌తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thar SUV | కొత్త కారు కొనుగోలు చేసిన ఆనందం క్షణాల్లోనే భయానక అనుభవంగా...