అక్షరటుడే, కామారెడ్డి: SPR School | హైదరాబాద్‌లోని (Hyderabad) టీహబ్‌లో (T-Hub) జరిగిన ఇండియన్ స్పేస్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ (Indian Space Education Conference)-2025లో ఎస్పీఆర్ పాఠశాల (SPR School) విద్యార్థులు ప్రతిభ చూపారని యాజమాన్యం పేర్కొంది. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేసింది.
ఈ కాన్ఫరెన్స్‌లో వందకు పైగా పాఠశాలలు పాల్గొన్నాయని.. చివరి పోటీకి కేవలం నాలుగు పాఠశాలలు మాత్రమే ఎంపికయ్యాయని వారు పేర్కొన్నారు. చివరగా.. Erudite అనే విభాగంలో ప్రతిష్టాత్మక సంస్థ ప్రతినిధి సత్యవర్ధన్ రెడ్డి పర్యవేక్షణలో ఎస్పీఆర్ పాఠశాల విద్యార్థులు తృతీయ బహుమతి సాధించారని యాజమాన్యం పేర్కొంది.
దాంతో పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు అభినందనలు తెలిపింది. ఇటీవల ఇండియన్ స్పేస్ సాంకేతిక విద్యారంగంలో జాతీయ స్థాయిలో కామారెడ్డి ఎస్పీఆర్ విద్యార్థులు ద్వితీయ బహుమతి సాధించిన విషయం తెలిసిందే.