అక్షరటుడే, ఎల్లారెడ్డి: Spot Admition | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో (YellaReddy Government Degree College) స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం బీఏ, బీకాం కోర్సుల్లో (BA and B.Com courses) చేరడానికి రాష్ట్ర ఉన్నత ఉన్నత విద్యా మండలి ‘దోస్ట్’కు సంబంధం లేకుండా స్పాట్ అడ్మిషన్లకు ప్రత్యేక అనుమతినిచ్చిందన్నారు. ఇంటర్ పాసైన విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు (original certificates), జిరాక్స్ కాపీలతో ఈనెల 15, 16 తేదీలలో కళాశాలలో హాజరు కావాలని సూచించారు.
ఇంటర్ టీసీ, ఇంటర్ మెమో, ఎస్సెస్సీ మెమో, బోనాఫైడ్ సర్టిఫికెట్లు, ఆదాయ ధృవపత్రం, కుల ధృవపత్రం, ఆధార్ కార్డు, రెండు ఫొటోలతో కళాశాలలో డైరెక్ట్‌గా హాజరై అడ్మిషన్ తీసుకోవచ్చని పేర్కొన్నారు. ఎల్లారెడ్డి ప్రాంత విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.