Homeజిల్లాలునిజామాబాద్​Sports Meet | చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్యమివ్వాలి: ఎమ్మెల్యే రాకేష్​ రెడ్డి

Sports Meet | చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్యమివ్వాలి: ఎమ్మెల్యే రాకేష్​ రెడ్డి

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే రాకేష్​ రెడ్డి పేర్కొన్నారు. పిప్రిలో స్పోర్ట్స్​మీట్​ను గురువారం ఆయన ప్రారంభించారు.

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్: Sports Meet | విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని, క్రీడలతో ఉన్నత అవకాశాలు అందిపుచ్చుకోవాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి (MLA Paidi Rakesh Reddy) అన్నారు.

ఆర్మూర్ పట్టణంలోని (Armoor town) పిప్రి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్​స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో 11వ జోనల్ లెవెల్ గేమ్స్, స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని కళాశాల మైదానంలో గురువారం నిర్వహించారు.

ఈ క్రీడల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే రాకేష్​రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు దేశ ఐక్యతలో భాగమని, క్రీడలతో విద్యార్థుల్లో (students) క్రమశిక్షణ, శరీర దారుఢ్యం పెంపొందుతుందన్నారు.

ఆధునిక కాలంలో పిల్లలు ఆటలకు దూరం అవుతున్నారన్నారు. అనంతరం విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మార్చ్​ఫాస్ట్​లో విజేతలుగా నిలిచిన కళాశాలలకు బహుమతులను అందజేశారు. రాకేష్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు స్పోర్ట్స్ టీషర్ట్స్ అందజేశారు. కార్యక్రమంలో కళాశాలల అధ్యాపకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.