అక్షరటుడే, ఇందూరు: Transco Sports | క్రీడలతో ఒత్తిడి దూరం అవుతుందని.. ఓటమి గెలుపునకు నాంది అని టీఎస్ ఎన్పీడీసీఎల్ (TS NPDCL) ఓఎంసీ ఎస్ఈ పీవీ రావు, నిజామాబాద్ (Nizamabad) ఎస్ఈ రాపల్లి రవీందర్ అన్నారు.
రెండు రోజులుగా నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో (Police Parade Ground) కొనసాగుతున్న తెలంగాణ ట్రాన్స్‌కో, డిస్కం హాకీ ఛాంపియన్షిప్ (Transco, DISCOM Hockey Championship) మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే ఉద్యోగులకు క్రీడలు మానసికోల్లాసాన్ని ఇస్తాయన్నారు.
ఉద్యోగులకు ఇలాంటి క్రీడా పోటీల వల్ల ఒత్తిడి దూరమవుతుందన్నారు. అనంతరం గెలుపొందిన జట్లకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో డీఈలు రమేష్, శ్రీనివాస్, వెంకట్ రమణ, విక్రమ్, ఎస్‌ఏవో శ్రీనివాస్, టోర్నమెంట్ ఆర్గనైజర్ ఏడీఈ తోట రాజశేఖర్, ఏవో గంగారం, సురేష్ కుమార్, శంకర్ నాయక్, స్పోర్ట్స్ సెక్రెటరీ గోపి, ఉత్తమ్, దినేష్, మూర్తి , సీనయ్య, సతీష్, సుభాన్ తదితరులు పాల్గొన్నారు.
ట్రాన్స్‌కో అంతర్ జిల్లాల హాకీ టోర్నమెంట్లో విజేతగా వరంగల్ సర్కిల్ గెలుపొందగా.. రన్నర్‌గా నిజామాబాద్ సర్కిల్ నిలిచింది. అలాగే తృతీయ స్థానంలో కరీంనగర్ జిల్లా నిలిచింది. టోర్నమెంట్లో ఎంపైర్లుగా స్వామి, శ్రీకాంత్, హరీష్, గంగాధర్, ఎన్.శ్రీకాంత్‌లు వ్యవహరించారు.
రన్నర్‌గా నిలిచిన నిజామాబాద్ సర్కిల్ జట్టు