అక్షరటుడే, ఇందూరు: Taekwondo Association | క్రీడలతో క్రమశిక్షణ, శారీరక దృఢత్వం అలవడుతుందని జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఛైర్మన్ బస్వా లక్ష్మీ నర్సయ్య (Baswa Lakshmi Narsaiah) అన్నారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని బస్వా గార్డెన్లో(Baswa Garden) కలర్ బెల్ట్ ప్రమోషన్ టెస్ట్ (Color Belt Promotion Test) నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తైక్వాండో నేర్చుకోవడంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. భవిష్యత్తులో జరిగే రాష్ట్రస్థాయి ఛాంపియన్షిప్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి జిల్లాకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులకు ఆయన సూచించారు. అనంతరం ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు బెల్ట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కోచ్ మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
