అక్షరటుడే, బాన్సువాడ: Mla Pocharam | క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) అన్నారు. బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో (Government Junior College) బుధవారం క్రీడా, వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
Mla Pocharam | అలరించిన విద్యార్థుల నృత్యాలు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడాకారులు రాష్ట్ర, జాతీయస్థాయిలో (state and national levels) రాణించాలని సూచించారు. ఈ సందర్భంగా క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆయన బహుమతులు ప్రదానం చేసి అభినందించారు. అనంతరం విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్, నోడల్ అధికారి సలాం, పిట్ల శ్రీధర్, ఎజాజ్, శ్రీనివాస్, ఖాలెక్, కృష్ణారెడ్డి, మొహమ్మద్ గౌస్, దావూడ్ తదితరులు పాల్గొన్నారు.