Homeజిల్లాలునిజామాబాద్​Limbadri Gutta | వైభవం.. శ్రీవారి ఎదుర్కోలు ఉత్సవం

Limbadri Gutta | వైభవం.. శ్రీవారి ఎదుర్కోలు ఉత్సవం

లింబాద్రి గుట్టపై బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ మేరకు గురువారం స్వామివారికి ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

అక్షరటుడే, భీమ్​గల్: Limbadri Gutta | భీమ్​గల్ మండలంలో (Bheemgal mandal) శ్రీమన్నింబాచల క్షేత్రం లింబాద్రి గుట్టపై శ్రీవారి ఎదుర్కోలు ఉత్సవం అంగరంగ వైభవంగా సాగింది. లక్ష్మీ నృసింహుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఎదుర్కోలు కార్యక్రమం ఆలయ పండితులు ఘనంగా నిర్వహించారు. స్వామి కల్యాణ మహోత్సవంలో (Swami Kalyana Mahotsavam) భాగమైన ఎదుర్కోలు కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

స్వర్ణలంకార భూషితులైన ఉత్సవ విగ్రహాలను మంగళ వాయిద్యాలు, భాజాభజంత్రీల మధ్య గర్భాలయం నుంచి కల్యాణ మండపానికి పుష్పాలంకృత పల్లకీలో ఊరేగింపుగా తీసుకొచ్చారు. నృసింహుడిని అశ్వవాహనంపై అలంకరించి కల్యాణ మండపం మొదలుకొని పుష్కరిణి, పుర వీధులలో ప్రదక్షిణ చేసి ఆంజనేయ స్వామి ఆలయం (Anjaneya Swamy temple) వద్ద స్వామి వారిని ఉంచారు.

శ్రీ లక్మీ అమ్మవారిని పల్లకీలో స్వామి చెంతకు ఎదురుగా తీసుకొని వచ్చి స్వామికి ప్రదక్షిణ చేయించారు. ఎదుర్కోలు సందర్భంగా అర్చకులు, వారి కుటుంబ సభ్యులు నృత్యాలు చేశారు. స్వామి ఎదుర్కోలు కార్యక్రమంలో పట్టణంతో పాటు వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.