Homeజిల్లాలుకామారెడ్డిPocharam Srinivas Reddy | ఆధ్యాత్మిక భావన పెంపొందించుకోవాలి : ఎమ్మెల్యే పోచారం

Pocharam Srinivas Reddy | ఆధ్యాత్మిక భావన పెంపొందించుకోవాలి : ఎమ్మెల్యే పోచారం

- Advertisement -

అక్షరటుడే, కోటగిరి :Pocharam Srinivas Reddy | ప్రజలు ఆధ్యాత్మిక భావన పెంపొందించుకోవాలని రాష్ట్ర వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam Srinivas Reddy) సూచించారు. పోతంగల్ మండలం సోంపూర్ గ్రామంలో అఖండ శివనామ సప్తాహం, మహాదేవ్, శివాజీ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాల్లో బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోంపూర్ గ్రామం ఆదర్శ గ్రామమన్నారు. గ్రామంలో ఆలయాలు నిర్మించుకుంటే శుభం జరుగుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని సూచించారు. కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఛైర్మన్ కాసుల బాలరాజ్, శివాజీ మహారాజ్ విగ్రహ దాత పోచారం సురేందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ శంకర్ పటేల్, పుప్పాల శంకర్, నాగరాజు, చాకురే గంగాధర్ పాల్గొన్నారు.

Must Read
Related News