అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: National Highway 44 | అతివేగంతో వెళ్తున్న ఓ లారీ బోల్తా పడిన ఘటన భిక్కనూరు మండలం (Bhikkanur mandal) సిద్దరామేశ్వర్‌నగర్ వద్ద 44వ జాతీయ రహదారిపై జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. టోల్‌ప్లాజా వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేసే క్రమంలో లారీని ఆపేందుకు యత్నించగా, డ్రైవర్ ఆపకుండా లారీ వేగంగా వెళ్లాడు. దీంతో పోలీసులు లారీని వెంబడించగా, రోడ్డుపై పెట్టిన డ్రమ్ములను తప్పించే క్రమంలో అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో డ్రైవర్, క్లీనర్లకు ఎలాంటి గాయాలు కాలేదు. కానీ వారు పరారు కాగా, పోలీసులు (police) వెంబడించి పట్టుకున్నారు. ఇదే సమయంలో కొంతమంది లారీ డ్రైవర్లు పోలీసులపై దాడికి యత్నించారు. దీంతో కొద్దిసేపు హైడ్రామా చోటు చేసుకుంది. ఈ కారణంగా భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. దీంతో వారిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
