HomeUncategorizedSBI Notification | ఎస్‌బీఐలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ కొలువులు

SBI Notification | ఎస్‌బీఐలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ కొలువులు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : SBI Notification | బ్యాంకింగ్‌ రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(SBI) శుభవార్త చెప్పింది. స్పెషలిస్ట్‌ ఆఫీసర్స్‌(Specialist Officers) పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నోటిఫికేషన్‌ వివరాలిలా ఉన్నాయి.

భర్తీ చేసే పోస్టుల సంఖ్య : 122
పోస్టుల వివరాలు..
మేనేజర్‌ (క్రెడిట్‌ అనలిస్ట్‌) పోస్టులు : 63
మేనేజర్‌ (ప్రొడక్ట్స్‌ – డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌), డిప్యూటీ మేనేజర్‌ (ప్రొడక్ట్స్‌ – డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌) పోస్టులు : 59
వేతనం : రూ. 64,820 నుంచి రూ. 1,05,280 వరకు..

వయోపరిమితి : ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి వయోపరిమితి ఇలా ఉండాలి.
మేనేజర్‌(Manager) పోస్టులకు 28 నుంచి 35 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేసుకోవాలి.
డిప్యూటీ మేనేజర్‌ పోస్టులకు 25 నుంచి 32 ఏళ్ల మధ్య వయసువారు, మేనేజర్‌ (క్రెడిట్‌ అనలిస్ట్‌) పోస్టులకు 25 నుంచి 35 మధ్య వయసువారు అర్హులు.

విద్యార్హతలు :
మేనేజర్‌ (క్రెడిట్‌ అనలిస్ట్‌) : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌తోపాటు ఎంబీఏ(ఫైనాన్స్‌) / పీజీడీబీఏ/పీజీడీబీఎం/ఎంఎంఎస్‌(ఫైనాన్స్‌) / సీఏ/సీఎఫ్‌ఏ/ఐసీడబ్ల్యూఏ పూర్తి చేసి ఉండాలి.
మేనేజర్‌ (ప్రొడక్ట్స్‌ – డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌), డిప్యూటీ మేనేజర్‌ (ప్రొడక్ట్స్‌ – డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌) పోస్టులకు : ఐటీ /కంప్యూటర్స్‌ /కంప్యూటర్‌ సైన్స్‌ /ఎలక్ట్రానిక్స్‌ /ఎలక్ట్రికల్‌ /ఇన్‌స్ట్రుమెంటేషన్‌ /ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్స్‌లో బీఈ లేదా బీటెక్‌ లేదా ఎంసీఏ పూర్తి చేసిన వారు అర్హులు.
ఆయా పోస్టులను అనుసరించి కనీసం మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు పని అనుభవం అవసరం.

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ ద్వారా
దరఖాస్తు గడువు : అక్టోబర్‌ 02.
దరఖాస్తు రుసుము :
జనరల్‌ /ఈడబ్ల్యూఎస్‌ / ఓబీసీ(OBC) అభ్యర్థులకు : రూ. 750.
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు : ఎటువంటి రుసుము లేదు.

పూర్తి వివరాల కోసం ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్‌ https://sbi.bank.in/web/careers ను సందర్శించగలరు.