అక్షరటుడే, వెబ్డెస్క్ : IOB Notification | స్పెషలిస్ట్ ఆఫీసర్(Specialist Officer) ఉద్యోగాల భర్తీ కోసం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB)నోటిఫికేషన్ విడుదల చేసింది. 127 పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి గల వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్(Notification) వివరాలిలా ఉన్నాయి.
భర్తీ చేసే పోస్టులు : స్పెషలిస్ట్ ఆఫీసర్స్ – 127 (ఎంఎంజీ స్కేల్ -II మరియు ఎంఎంజీ స్కేల్ -III పోస్టులు)
విద్యార్హత : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ(Degree)/ బీటెక్/ బీఈ/ ఎంఎస్సీ/ ఎంఈ/ ఎంటెక్/ ఎంబీఏ/ పీజీడీఎం/ పీజీడీబీఏలో ఉత్తీర్ణత అవసరం.
వయోపరిమితి : సెప్టెంబర్ ఒకటో తేదీనాటికి 25 నుంచి 40 ఏళ్లలోపు వారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
వేతనం :
MMGS- II పోస్టులకు రూ. 64,820.
MMGS – III పోస్టులకు రూ. 85,920.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు గడువు : అక్టోబర్ 3.
దరఖాస్తు రుసుము : జనరల్(General), ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు వెయ్యి రూపాయలు.
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ. 175.
ఎంపిక విధానం : రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు సంస్థ అధికారిక వెబ్‌సైట్ https://www.iob.bank.in/Careers లో సంప్రదించగలరు.