అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bank Jobs | ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్స్(ఐబీపీఎస్) మరో నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది. పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఐటీ ఆఫీసర్ (IT Officer), అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ (Agriculture Field Officer), లా ఆఫీసర్ (Law Officer), రాజ్‌భాష అధికారి (Rajbhasha Officer) తదితర పోస్టుల భర్తీకోసం ఈ నోటిఫికేషన్ ఇచ్చింది. పోస్టులు, అర్హతల వివరాలిలా ఉన్నాయి.
భర్తీ చేసే పోస్టులు : స్పెషలిస్ట్ ఆఫీసర్
పోస్టుల సంఖ్య : 1,007 (బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda), యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, పీఎన్‌బీ, యూకో, కెనరా బ్యాంక్)
విద్యార్హతలు : సంబంధిత విభాగంలో బీఎస్సీ (B.Sc.), బీటెక్/ఎంఈ/ఎంటెక్, పీజీడీఎం, ఎంబీఏ, ఎల్‌ఎల్‌బీ, ఎంఏ.
వయో పరిమితి : జూలై ఒకటో తేదీ నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అర్హులు. నిబంధనలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ(OBC) అభ్యర్థులకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
వేతనం : స్కేల్ 1 ఆఫీసర్‌కు నెలకు మూల వేతన శ్రేణి రూ. 48,480 నుంచి రూ. 85,920 ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ : మూడంచెల్లో ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా ప్రిలిమినరీ పరీక్ష, ఆన్‌లైన్ ద్వారా మెయిన్ పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా..
దరఖాస్తుకు చివరి తేది : ఈనెల 21.
ప్రిలిమినరీ పరీక్ష: ఆగస్టులో
మెయిన్ పరీక్ష: నవంబర్‌లో
పూర్తి వివరాల కోసం https://www.ibps.in వెబ్‌సైట్‌లో సంప్రదించాలి.