అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Bank Recruitments | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ముంబయి ప్రధాన కార్యాలయం కాంట్రాక్ట్(Contract), రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (SCO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయా పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొంది. నోటిఫికేషన్(Notification) వివరాలిలా ఉన్నాయి.
పోస్టుల వివరాలు..
భర్తీ చేసే పోస్టుల సంఖ్య : 37
జనరల్ మేనేజర్ (GM) : 01
అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ (AVP) : 28
డిప్యూటీ మేనేజర్ (DM) : 08
విద్యార్హతలు: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/ఎంటెక్/ఎంసీఏలలో ఉత్తీర్ణత, పని అనుభవం కలిగి ఉండాలి.
వయో పరిమితి:
జనరల్ మేనేజర్ పోస్టుకు : 45 నుంచి 55 ఏళ్లలోపువారు.
అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు : 33 నుంచి 45 ఏళ్లలోపువారు.
డిప్యూటీ మేనేజర్ పోస్టుకు : 25 నుంచి 35 ఏళ్లలోపువారు.
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తుకు చివరి తేదీ : ఈనెల 31.
పూర్తి వివరాలకు https://sbi.co.in లో సంప్రదించండి.