- Advertisement -
Homeజిల్లాలుకామారెడ్డిYellareddy | శ్రీ మహాలక్ష్మికి ప్రత్యేక పూజలు

Yellareddy | శ్రీ మహాలక్ష్మికి ప్రత్యేక పూజలు

- Advertisement -

అక్షర టుడే, ఎల్లారెడ్డి: Yellareddy | ఎల్లారెడ్డి మండల కేంద్రంలో ని పోచమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో (Sharannavaratri festivals) శుక్రవారం అమ్మవారు శ్రీ మహాలక్ష్మీ దేవి (Sri Mahalakshmi Devi) అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

మహాలక్ష్మీ అమ్మవారికి వేకువ జాము నుంచే అర్చకులు ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ సందర్భంగా మహిళలు ప్రత్యేక పూజలతో పాటు కుంకుమార్చన (kummarchan)నిర్వహించారు. మూడు శక్తుల్లో ఒక శక్తి అయిన శ్రీ మహాలక్ష్మీ అమ్మ వారు అమితమైన పరాక్రమంతో.. డోలాసురుడనే రాక్షసుడిని సంహరించి సమస్త లోకాలకు శాంతి చేకూర్చింది.

- Advertisement -

అన్ని సౌఖ్యాలతో జీవించడానికి అవసరమయ్యే ప్రతి అంశమూ ఆ దేవిస్వరూపమే అని పండితులు భక్తులకు వివరించారు . దీనికి మహిళలు ప్రతీకలుగా నిలుస్తారు. బిడ్డలకు జ్ఞానాన్ని బోధిస్తూ విద్యాలక్ష్మిగా, ఇంటిల్లిపాదికీ భోజనం పెడుతూ ధాన్యలక్ష్మిగా, కష్టాల్లో భర్తకి ధైర్యం చెబుతూ ధైర్యలక్ష్మిగా, కుటుంబం పేరు నిలిపేలా సంతానాన్ని తీర్చిదిద్దుతూ సంతానలక్ష్మిగా, భర్త సాధించే విజయానికి మూలకారణంగా ఉంటూ విజయలక్ష్మిగా… అన్ని రూపాల్లో తానే అయి సంసారాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యతను మహిళలకు లక్ష్మీదేవి అలంకారాలు గుర్తు చేస్తాయి. కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News