అక్షరటుడే, వెబ్డెస్క్ : Special Train | రాజస్థాన్లోని అజ్మీర్ దర్గాకు (Ajmer Dargah) తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది భక్తులు వెళ్తుంటారు. ఈ క్రమంలో రైల్వే శాఖ (Railway Department) భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైలు నడపనున్నట్లు ప్రకటించింది.
అజ్మీర్ దర్గా వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే జోన్ (South Central Railway Zone) విజయవాడ డివిజన్ రైల్వే అధికారులు ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు. మచిలీపట్నం నుంచి అజ్మీర్ (07274) డిసెంబర్ 21న ప్రత్యేక రైలు వెళ్తుంది. దిగువ మార్గంలో అజ్మీర్ నుంచి మచిలీపట్నం(07275) రైలు డిసెంబర్ 28న ఉంటుంది. ఈ రైలు నిజామాబాద్, పెద్దపల్లి మార్గంలో రాకపోకలు సాగిస్తుంది.
Special Train | ఈ స్టేషన్లలో ఆగుతుంది
ఈ ప్రత్యేక వీక్లీ ఎక్స్ ప్రెస్ రైళ్లకు (special weekly express trains) తెలుగు రాష్ట్రాల్లోని గుడివాడ జంక్షన్, విజయవాడ జంక్షన్, ఖమ్మం, డోర్నకల్ జంక్షన్, మహబూబాబాద్, వరంగల్, జమ్మికుంట, పెద్దపల్లి జంక్షన్, కరీంనగర్, లింగంపేట, జగిత్యాల, మోర్తాడ్, ఆర్మూర్, నిజామాబాద్ జంక్షన్, బాసర రైల్వే స్టేషన్లలో స్టాప్ సదుపాయం కల్పించారు. ఈ ప్రత్యేక రైలు ద్వారా ప్రముఖ జ్యోతిర్లింగాలైన ఛత్రపతి శంభాజీ నగర్ దగ్గరలోని భీమశంకర్, గృష్ణేశ్వర్, ఉజ్జయినిలో మహాకాళేశ్వర ఆలయాలను దర్శనం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. కావున భక్తులు వినియోగించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
Special Train | పలు రైళ్ల పొడిగింపు
శీతాకాలం, సంక్రాంతి సీజన్ (Sankranti season) సందర్భంగా పలు రైలు సర్వీసులను పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సికింద్రాబాద్–అనకాపల్లి జనవరి 4, 11, 18న రైలు నడపనున్నారు. అనకాపల్లి నుంచి సికింద్రాబాద్ మధ్య జనవరి 5, 12, 18న ప్రత్యేక రైలు వెళ్తుంది. హైదరాబాద్ –గోలక్పూర్ రైలు జనవరి 9, 16, 23న నగరం నుంచి బయలు దేరనుంది. దిగువ మార్గంలో జనవరి 11, 18, 25 తేదీల్లో గోలక్పూర్ నుంచి బయలు దేరుతుంది.