అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Railway Passengers | దీపావళి పండుగ సందర్భంగా ప్రజలకు రైల్వే శాఖ(Railway Department) గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ రద్దీ నేపథ్యంలో కరీంనగర్ నుంచి ముంబయికి ప్రత్యేక రైలు నడపనున్నట్లు పేర్కొంది.
దీపావళి పండుగ(Diwali Festival)ను పురస్కరించుకొని ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినల్ నుంచి కరీంనగర్ వరకు వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వే అధికారులు నడపనున్నారు. రైలు సంఖ్య 01021 ప్రతి శనివారం ముంబై నుంచి కరీంనగర్ వస్తోంది. ఈ నెల 11 నుంచి నవంబర్ 15 వరకు ఈ రైలు ప్రతివారం నడవనుంది. ముంబై నుంచి కరీంనగర్‌కు (01021) రైలు ప్రతి శనివారం రాత్రి 12 :20 గంటలకు బయలు దేరుతుంది. అదే రోజు సాయంత్రం 4 గంటలకు కరీంనగర్ చేరుకుంటుంది. అనంతరం శనివారం 5:30 గంటలకు కరీంనగర్ (01022) నుంచి బయలుదేరుతుంది. ఆదివారం మధ్యాహ్నం 1:50 గంటలకు ముంబై చేరుకుంటుంది.
Railway Passengers | ఆరు ట్రిప్పులు
ప్రత్యేక వీక్లి ఎక్స్‌ప్రెస్ ఎగువ మార్గంలో ఆరు ట్రిప్పులు, దిగువ మార్గంలో ఆరు ట్రిప్పులు రాకపోకలు సాగించనుంది. ఈ మేరకు మధ్య రైల్వే జోన్, ముంబయి డివిజన్ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ రైలు తెలంగాణలోని బాసర, నిజామాబాద్ జంక్షన్, ఆర్మూర్, మెట్పల్లి, కోరుట్ల రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. కానీ జిల్లా కేంద్రమైన లింగంపేట జగిత్యాల రైల్వే స్టేషన్లో హాల్ట్ సదుపాయం కల్పించలేదు. దీంతో ఇక్కడ నుంచి ముంబయి, షిరిడీ వెళ్లే ప్రయాణికులు(Railway Passengers) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇదే మార్గం మీదుగా వెళ్తున్న కరీంనగర్– లోక మాన్య తిలక్ టెర్మినల్ ముంబయి వీక్లీ ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలుకు కూడా మధ్య రైల్వే జోన్ ముంబయి డివిజన్ అధికారులు జగిత్యాల రైల్వే స్టేషన్లో స్టాప్ సౌకర్యం కల్పించలేదు.
Railway Passengers | 22 బోగీలు
ప్రత్యేక వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లో మొత్తం 22 బోగీలు ఉంటాయి. ఇందులో 20 ఏసీ త్రీ టైర్ కోచ్‌లు, రెండు జనరల్ బోగీలు ఉంటాయి. అయితే స్లీపర్ బోగీలు ఉండవు. దీంతో టికెట్ రేటు అధికంగా ఉండనుంది. ఈ రైలు మహారాష్ట్రలోని దాదార్, థానే, కల్యాణ్, ఇగాట్‌పురి, నాసిక్రోడు, మన్మాడ్, నాగర్సోల్, ఔరంగాబాద్, జల్నా, పర్తుర్, సేలు, పర్బణి, పూర్నా, హజుర్ సాహెబ్ నాందేడ్, ముద్కేడ్,ధర్మాబాద్లలో ఆగుతుంది.