అక్షరటుడే, ఇందూరు: RTC tour package | కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని నిజామాబాద్ నుంచి ఈనెల 3న అరుణాచలానికి (Arunachalam) ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆర్ఎం జ్యోత్న్య తెలిపారు. నిజామాబాద్ బస్టాండ్ (Nizamabad RTC) నుంచి మూడవ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు బయలుదేరుతుందని పేర్కొన్నారు.
RTC tour package | కాణిపాకం.. వెల్లూరు గోల్డెన్ టెంపుల్..
కాణిపాకం, వెల్లూరు గోల్డెన్ టెంపుల్ (Vellore Golden Temple), అరుణాచలం, కంచి, జోగులాంబ, బీచుపల్లి హనుమాన్ ఆలయం దర్శనాలను చేసుకోవచ్చన్నారు. తిరిగి 7వ తేదీ తెల్లవారుజామున నిజామాబాద్ చేరుకుంటుందని పేర్కొన్నారు. వివరాలకు వెబ్సైట్ www.tgsrtcbus.in ద్వారా లేదా సమీప బస్టాండ్ రిజర్వేషన్ కౌంటకోబ బస్సు సర్వీస్ నెంబర్ 98883తో టికెట్ పొందవచ్చన్నారు. పూర్తి వివరాలకు 7382840367, 9490410939 నంబర్లను సంప్రదించాలన్నారు.
