అక్షరటుడే, ఇందూరు: Dinesh Kulachari | బీజేపీ జిల్లా (NZB Nizamabad) అధ్యక్షుడు దినేష్ కులాచారి జన్మదినం సందర్భంగా ఆదివారం పార్టీ కార్యకర్తలు సంబురాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నగరంలోని గుమాస్తా కాలనీలోని (Gumastha colony) దుర్గాదేవి ఆలయంలో (Durgadevi Temple).. ఆలయ అధ్యక్షుడు అమందు విజయ్‌కృష్ణ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సనాతన ధర్మ రక్షణ కోసం నిత్యం ప్రజల్లో ఉంటూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారన్నారు.
చిన్న వయసు నుంచే రాజకీయాల్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదుగుతున్నారన్నారు. భవిష్యత్‌లో దినేష్ మరిన్ని ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి బాపూరావు, కోశాధికారి ధాత్రిక వేణుగోపాల్, లవంగ సదాశివ, అనిల్ కుమార్, సంతోష్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.
