అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | మండలంలోని బ్రాహ్మణపల్లి(Brahmanpalli) గ్రామ శివారులో కొలువైన అంజనాద్రి క్షేత్రంలో మంగళవారం పిట్లం(Pitlam) మాజీ ఎంపీపీ కవితా విజయ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురియాలని పాడిపంటలు చల్లగా ఉండాలని కోరుతూ పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ నిర్వాహకులు కిషోర్ కుమార్ ఎంపీపీ దంపతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అరవింద్ కుమార్ ఆనంద్ కుమార్ తదితరులు ఉన్నారు.
