అక్షరటుడే, భీమ్గల్ : Bheemgal | హైదరాబాద్లోని (Hyderabad) రవీంద్రభారతిలో ఇటీవల మాచిరాజు బాల సాహిత్య పీఠం ఆధ్వర్యంలో కథల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మండలంలోని బాచన్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు (Bachanpalli High School) చెందిన 15 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కాగా.. ఉత్తమ ప్రతిభ కనబర్చిన రావుట్ల లిఖిత్కు నగదు బహుమతితో పాటు చందమామ కథలు అనే పుస్తకాన్ని సంస్థ అందించిందని పాఠశాల హెచ్ఎం వసంత తెలిపారు. పాల్గొన్న విద్యార్థులందరికీ ప్రశంసా పత్రాలను అందజేశారన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థిని పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.
