అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Kanteshwar Temple | నిజామాబాద్ (Nizamabad) నగరంలోని నీలకంఠేశ్వరాలయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ (Bomma Mahesh Kumar Goud) దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్వామివారికి అభిషేకం చేశారు. అనంతరం ఆలయం పరిసరాలను సందర్శించారు. ఆలయ వైభవం, అభివృద్ధి వివరాలను అర్చకులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు.. టీపీసీసీ చీఫ్‌కు ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. పూర్ణకుంభంతో సత్కరించారు. ఆయన వెంట పలువురు నాయకులు ఉన్నారు.

Kanteshwar Temple | సుబ్రమణ్య షష్ఠి సందర్భంగా ప్రత్యేక పూజలు
సుబ్రమణ్య షష్ఠి సందర్భంగా బుధవారం నీలకంఠేశ్వరాలయం (Neelkantheshwara Temple)లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సామూహికంగా పంచామృతాలతో అభిషేకాలు చేశారు. ఆలయ పూజారులు సుహాస్, నీలేష్, మకరంద్, చంద్రశేఖర్ తదితరులు భక్తులతో అభిషేకాలు చేయించారు. ఉదయం నుంచే భక్తులు ఆలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
