ePaper
More
    HomeతెలంగాణCM Revanth Reddy | మేడారం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక.. అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్

    CM Revanth Reddy | మేడారం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక.. అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: CM Revanth Reddy | రాష్ట్రంలోనే దేశవ్యాప్తంగా గుర్తింపు గిరిజన ఆధ్యాత్మిక క్షేత్రం మేడారంతో పాటు బాసర ఆలయ (Basara Temple) అభివృద్ధికి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

    మేడారం (Medaram), బాసర ఆలయాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి సోమవారం మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మేడారం, బాసర ఆలయాల అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ గురించి అధికారులు సీఎంకు వివరించారు.

    CM Revanth Reddy | 100 రోజులు పనులు పూర్తయ్యేలా..

    మేడారం మహా జాతర తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి అని గుర్తు చేసిన ముఖ్యమంత్రి.. జాతర నాటికి భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ఆదేశించారు. 100 రోజుల్లో మేడారం అభివృద్ధి పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. మేడారం అభివృద్ధికి సంబంధించి పలు డిజైన్లను పరిశీలించిన సీఎం.. పూర్తిగా సహజసిద్ధమైన రాతి కట్టడాలతో నిర్మాణాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

    భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఎంట్రీ, ఎగ్జిట్, పార్కింగ్ వసతులు ఉండాలని మార్గనిర్దేశం చేశారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జంపన్న వాగులో నీరు నిలిచేలా ఏరియాల వారీగా చెక్ డ్యామ్ ల నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వారంలోపు మేడారం క్షేత్రానికి వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తానని, ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

    బాసర జ్ఞాన సరస్వతీ దేవాలయాన్ని మరింత ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దాలని సీఎం (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. ఆలయ విస్తరణ, అభివృద్ధికి సంబంధించిన పలు సూచనలు చేశారు. అన్ని దేవాలయాల అభివృద్ధికి సంబంధించి స్థానిక సెంటిమెంట్ ను గౌరవించడంతోపాటు స్థానిక నిపుణులు, పూజారుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఆధ్యాత్మిక క్షేత్రాలను అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలన్నారు.

    More like this

    Mancherial | యువతి ఆత్మహత్య.. విషయం తెలిసి బావిలో దూకిన ప్రియుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mancherial మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రేమ జంట ఆత్మహత్య...

    Transco | ట్రాన్స్​కో వరంగల్​ ప్రాజెక్టు డైరెక్టర్​ మోహన్​రావుకు ఘనస్వాగతం

    అక్షరటుడే, ఇందూరు: Transco | జిల్లాకు మొదటిసారిగా వచ్చిన ట్రాన్స్​కో వరంగల్​ ప్రాజెక్టు (Transco Warangal Projects) డైరెక్టర్​...

    DEO Ashok | విద్యార్థి విజ్ఞాన్‌ మంథన్‌ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

    అక్షరటుడే, ఇందూరు : DEO Ashok | విద్యార్థి విజ్ఞాన్‌ మంథన్‌ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో అశోక్‌...