Homeజిల్లాలునిజామాబాద్​Lok Adalat | నవంబర్ 15న స్పెషల్ లోక్ అదాలత్ : జిల్లా జడ్జి భరతలక్ష్మి

Lok Adalat | నవంబర్ 15న స్పెషల్ లోక్ అదాలత్ : జిల్లా జడ్జి భరతలక్ష్మి

నవంబర్​ 15న స్పెషల్​ లోక్​ అదాలత్​ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరతలక్ష్మి పేర్కొన్నారు. జిల్లా కోర్టులోని తన ఛాంబర్​లో ఆమె విలేకరులతో మాట్లాడారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Lok Adalat | స్పెషల్ లోక్ అదాలత్​ను నవంబర్ 15న కోర్టు ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు జిల్లా జడ్జి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఛైర్​పర్సన్ జీవీఎన్​ భరతలక్ష్మి (GVN Bharathalakshmi) తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని తన ఛాంబర్​లో శనివారం సీపీసాయిచైతన్య (CP Sai Chaitanya), న్యాయసేవ సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు.

Lok Adalat | రాజీపడదగిన కేసులు..

ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. 1,328 క్రిమినల్ కేసులను గుర్తించామని తెలిపారు. వాటికోసం లోక్ అదాలత్ బెంచ్​లను (Lok Adalat benches) ఏర్పాటు చేసినట్లు వివరించారు. విబేధాలు వచ్చినప్పుడు సర్దుకుని రాజీ మార్గంలో వెళ్లడమే ఉత్తమమని ఆమె పేర్కొన్నారు. ఆర్మూర్, బోధన్ కోర్టు ప్రాంగణాలతో పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో ప్రత్యేక లోక్ అదాలత్ జరుగుతుందని ఆమె వెల్లడించారు.

లోక్ అదాలత్ వైపు వెళ్లేవిధంగా కక్షిదారులను ప్రోత్సహించాలని పౌర సమాజానికి జిల్లా జడ్జి విజ్ఞప్తి చేశారు. మనిషి సంఘజీవి అని సమాజంలో అందరితో కలిసి శాంతియుతంగా జీవించే సమయాలలో సమస్యల విషవలయంలో చిక్కుకోరాదని ఆమె అన్నారు. ప్రజల న్యాయపరమైన వివాదాలు, త్వరితిగతిన రాజీపద్ధతి విధానంలో పరిష్కరించుకోవడానికి న్యాయసేవల చట్టం (Legal Services Act) అత్యుత్తమని జిల్లా జడ్జి భరతలక్ష్మి పేర్కొన్నారు.

Lok Adalat | పోలీస్​శాఖ నుంచి పూర్తి మద్దతు..

పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ స్పెషల్ లోక్ అదాలత్​కు (Special Lok Adalat) పోలీసుశాఖ సంపూర్ణ మద్దతునిస్తూ, విజయవంతం చేసేందుకు కృషి చేస్తుందని తెలిపారు. చిన్నచిన్న క్రిమినల్ కేసులు, క్షణికావేశంలో చేసిన రాజీ పడదగిన కేసులు స్పెషల్ లోక్ అదాలత్​లో పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. న్యాయశాఖకు (judicial department) పూర్తి మద్దతునిస్తూ పోలీస్​ శాఖ ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు.

Must Read
Related News