అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | పొరపాట్లకు అవకాశం లేకుండా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (Special Intensive Revision) ప్రక్రియ పూర్తిచేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ (Hyderabad) నుంచి అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లోకేష్ కుమార్తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ.. 2002 ఎలక్టోరల్ జాబితాలో నియోజకవర్గాల వారీగా 2025–ఎలక్టరోల్ జాబితా మ్యాపింగ్ చేసి నాలుగు కేటగిరీలుగా విభజించడం జరిగిందన్నారు.
1987 కంటే ముందు జన్మించి 2002, 2025 ఎలక్టోరల్ జాబితాలో నమోదు కాబడినవారు కేటగిరి–ఏ చేర్చామన్నారు. 1987 కంటే ముందు జన్మించి 2002 ఓటరు జాబితాలో లేకుండా 2025 జాబితాలో నమోదు కాబడిన వారిని కేటగిరి–బీ ఉంచామన్నారు. 1987 నుంచి 2002 మధ్యలో జన్మించి 2025 ఓటరు జాబితాలో నమోదు కాబడిన వారు కేటగిరి–సీగా విభజించామన్నారు. అలాగే 2002 నుంచి 2007 మధ్యలో జన్మించిన వారిని కేటగిరి–డీగా విభజించినట్లు తెలిపారు. అన్ని కేటగిరీలు కలిపి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3.33 కోట్ల ఓటర్లను మ్యాపింగ్ చేయడం జరిగిందని వివరించారు.
Nizamabad Collector | శిక్షణ ఇస్తున్నాం..: కలెక్టర్
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) మాట్లాడుతూ.. బీఎల్వోలు, సూపర్వైజర్లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. తొలుత కేటగిరి–ఏ ఓటర్ జాబితాను నిర్ధారించిన తర్వాత, కేటగిరి సీ, డీలను కేటగిరి–ఏకు లింక్ చేయడం జరుగుతుందని వివరించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా దశలవారీగా పూర్తి చేస్తామని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో 50శాతం మ్యాపింగ్ పూర్తయిందని వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.