ePaper
More
    Homeభక్తిVaralakshmi Vratam | వరలక్ష్మీ వ్రత విశిష్టత.. పార్వతికి పరమేశ్వరుడు వివరించిన దివ్యగాథ

    Varalakshmi Vratam | వరలక్ష్మీ వ్రత విశిష్టత.. పార్వతికి పరమేశ్వరుడు వివరించిన దివ్యగాథ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Varalakshmi Vratam | స్త్రీలు సకల సౌభాగ్యాలు, పుత్రపౌత్రాభివృద్ధి, ఆయురారోగ్యాలతో తరించడానికి చేయవలసిన అత్యుత్తమ వ్రతం గురించి పార్వతీదేవి ఒకనాడు పరమేశ్వరుడిని(Lord Shiva) అడిగింది. అప్పుడు ఆ త్రినేత్రుడు సర్వ శుభాలు కలిగించే వరలక్ష్మీ వ్రతం గురించి వివరించాడు. ఈ పవిత్రమైన వ్రతాన్ని శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు లేదా రెండవ శుక్రవారం రోజున ఆచరించాలని తెలియజేశాడు. ఈ వ్రత మహత్యం గురించి సూత మహర్షి శౌనకాది మహర్షులకు చెప్పిన గాథను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

    Varalakshmi Vratam | వరలక్ష్మీ వ్రతానికి మూలకారణం

    పూర్వం కైలాసంలో పరమశివుడు తన భస్మసింహాసనంపై కూర్చుని ఉండగా, నారద మహర్షితో పాటు ఇంద్రాది దేవతలు ఆయనను కీర్తిస్తున్నారు. ఆ అద్భుతమైన సమయంలో పార్వతీదేవి(Lord Parvathi) పరమేశ్వరుడిని “నాథా! స్త్రీలు సుఖసంతోషాలతో, పుత్రపౌత్రాభివృద్ధిగా తరించడానికి తగిన వ్రతం ఒకదానిని చెప్పండి” అని కోరింది. అప్పుడు శివుడు “దేవీ! నీవు కోరినట్లు స్త్రీలకు సకల శుభాలు, అష్టైశ్వర్యాలు కలిగించే వరలక్ష్మీ వ్రతం అనేది ఒకటి ఉంది. దానిని శ్రావణమాసం(Shravana Masam)లోని రెండో శుక్రవారం రోజున ఆచరించాలి” అని వివరించాడు. ఈ వ్రతం విశిష్టతలను, దానిని ఆచరించిన చారుమతి కథను వివరంగా పార్వతీదేవికి తెలియజేశాడు.

    Varalakshmi Vratam | చారుమతి కథ – వ్రత ఆచరణకు ప్రేరణ

    కాత్యాయనీ! పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఉండేది. ఆ పట్టణం బంగారు కుడ్యాలతో, రమణీయంగా ఉండేది. అక్కడ చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ నివసించేది. ఆమె అత్యంత సుగుణవతి, భక్తిపరురాలు. నిత్యం భర్త పాదాలకు నమస్కరించి, అత్తమామలను శ్రద్ధగా సేవలు చేసేది. ఆమెకు ఒకరోజు రాత్రి వరలక్ష్మీదేవి(Varalakshmi Devi) కలలో సాక్షాత్కరించి, “ఓ చారుమతీ! ఈ శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీ కోరికలన్నీ నెరవేరుతాయి” అని చెప్పి అదృశ్యమైంది. ఆ కలకు ఆనందించిన చారుమతి, వరలక్ష్మీదేవిని పరిపరివిధాల స్తుతించింది.

    Varalakshmi Vratam | వ్రతం ప్రారంభం..

    చారుమతి ఆ కలను తన భర్తకు, అత్తమామలకు వివరించింది. వారు సంతోషించి ఆమెను వ్రతం ఆచరించమని ప్రోత్సహించారు. ఈ విషయం విన్న పట్టణంలోని ఇతర మహిళలు కూడా ఈ పవిత్ర వ్రతం కోసం ఎదురుచూడసాగారు. శ్రావణ శుక్రవారం రోజున వారందరూ ఉదయాన్నే లేచి, స్నానం చేసి, పట్టువస్త్రాలు ధరించి చారుమతి ఇంటికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో ఒక మండపం ఏర్పాటు చేసి, బియ్యం పోసి, పంచపల్లవాలతో కలశం ప్రతిష్టించి, సంకల్ప విధులతో “సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే!” అంటూ వరలక్ష్మీదేవిని ఆహ్వానించి ప్రతిష్టించింది.

    Varalakshmi Vratam | వ్రత ఫలితాలు – అష్టైశ్వర్యాల ప్రాప్తి

    పూజలో భాగంగా అమ్మవారిని షోడశోపచారాలతో పూజించి, రకరకాల భక్ష్యభోజ్యాలను నైవేద్యంగా సమర్పించారు. అనంతరం తొమ్మిది పోగుల తోరాన్ని చేతికి కట్టుకుని, అమ్మవారికి ప్రదక్షిణలు చేశారు. వారు మొదటి ప్రదక్షిణ చేయగానే వారి కాళ్ళకు ఘల్లుఘల్లుమనే అందెలు, రెండవ ప్రదక్షిణ చేయగానే నవరత్నాలతో మెరిసే కంకణాలు, మూడవ ప్రదక్షిణ చేయగానే సర్వాభరణాలు వాటంతట అవే వచ్చాయి. చారుమతి ఇంటితో పాటు ఆ పట్టణంలోని ఇతర స్త్రీల ఇళ్లు కూడా ధన, కనక, వస్తు వాహనాలతో నిండిపోయాయి. ప్రజలందరూ గజ, తురగ, రథ వాహనాలతో వచ్చి వారిని గౌరవంగా ఇళ్లకు తీసుకెళ్లారు. వారు ఏటా వరలక్ష్మీ వ్రతం(Varalakshmi Vratam) చేసి, సకల సౌభాగ్యాలు, సిరిసంపదలతో సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు.

    Varalakshmi Vratam | వ్రత ఆచరణ, నియమాలు

    సూత మహాముని శౌనకాది మహర్షులతో “శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వ్రత కథను మీకు సవివరంగా వివరించాను. ఈ కథను విన్నా, ఈ వ్రతం చేసినా, చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి” అని చెప్పారు. ఈ కథ విన్న తరువాత శిరసుపై అక్షతలు వేసుకుని, ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు పంచి, పూజ చేసినవారు వాటిని స్వీకరించాలి. రాత్రి ఉపవాసం ఉండి, భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు.

    Latest articles

    US tariffs | అన్యాయం.. అసమంజసం.. అమెరికా సుంకాలను తీవ్రంగా ఖండించిన భారత్

    అక్షరటుడే, న్యూఢిల్లీ: US tariffs : అమెరికా అదనపు సుంకాలు పెంచడాన్ని ఇండియా India తీవ్రంగా ఖండించింది. భారత...

    Helmet | హెల్మెట్​ బదులు పాల క్యాన్​ మూత.. పెట్రోల్​ బంకు​ సీజ్​..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Helmet : మధ్యప్రదేశ్​(Madhya Pradesh)లోని ఇండౌర్​(Indore)లో తాజాగా కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి తీసుకొచ్చారు. ద్విచక్ర...

    BC Reservations | బీసీ రిజర్వేషన్ బిల్లులను వెంటనే ఆమోదించాలి : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BC Reservations | స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు...

    FASTag | 15 నుంచి ఫాస్టాగ్ వార్షిక పాస్ ప్రారంభం.. వాహనదారులకు ఎన్నో ప్రయోజనాలు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: FASTag | జాతీయ రహదారులపై తరచూ ప్రయాణం చేసే వాహనదారుల కోసం కేంద్ర ప్రభుత్వం వార్షిక...

    More like this

    US tariffs | అన్యాయం.. అసమంజసం.. అమెరికా సుంకాలను తీవ్రంగా ఖండించిన భారత్

    అక్షరటుడే, న్యూఢిల్లీ: US tariffs : అమెరికా అదనపు సుంకాలు పెంచడాన్ని ఇండియా India తీవ్రంగా ఖండించింది. భారత...

    Helmet | హెల్మెట్​ బదులు పాల క్యాన్​ మూత.. పెట్రోల్​ బంకు​ సీజ్​..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Helmet : మధ్యప్రదేశ్​(Madhya Pradesh)లోని ఇండౌర్​(Indore)లో తాజాగా కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి తీసుకొచ్చారు. ద్విచక్ర...

    BC Reservations | బీసీ రిజర్వేషన్ బిల్లులను వెంటనే ఆమోదించాలి : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BC Reservations | స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు...