అక్షరటుడే, వెబ్‌డెస్క్: Puri Jagannath : ఆషాఢ శుద్ధ విదియ(Ashadha Shuddha Vidiya)నాడు పూరీ క్షేత్రంలో అంగరంగ వైభవంగా ఆ జగన్నాథుడి రథయాత్ర Rath Yatra సాగుతుంది. ఈ వేడుకను తిలకించడానికి, స్వామివారి రథాన్ని లాగడానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఆ జన సంద్రం చేసే జగన్నాథ జయజయ ధ్వానాలతో పూరీ(Puri) పుర వీధులన్నీ ప్రతిధ్వనిస్తాయి. శుక్రవారం(నేడు) జగన్నాథ రథయాత్ర(Jagannath Rath Yatra) నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రథయాత్రతోపాటు జగన్నాథ ఆలయం విశేషాలు తెలుసుకుందామా..
ఏ ఆలయంలోనైనా దేవుడు ఏకమూర్తిగానో.. సతీ సమేతంగానో దర్శనమిస్తాడు. కానీ పూరీ జగన్నాథుడు సోదరి సుభద్ర(Subhadra), సోదరుడు బలరాముడి(Balarama)తో కలిసి కొలువుదీరడం గమనార్హం.
ఊరేగింపు కోసం ఎక్కడా మూల విరాట్టును కదిలించరు. కానీ పూరీ జగన్నాథ ఆలయంలో మాత్రం ఇందుకు భిన్నంగా ఏటా రథయాత్ర సందర్భంగా మూల విరాట్టే భక్తుల కోసం కదిలొస్తాడు. సాధారణంగా రథయాత్ర కోసం ఒకే రథాన్ని వినియోగిస్తారు. కానీ పూరీలో ఏటా దేవదేవుడు కొత్త రథంపై సంచరిస్తాడు.
Puri Jagannath : పక్కా లెక్కతో రథాల నిర్మాణం..
రథాల నిర్మాణం రెండు నెలల ప్రక్రియ. పూరి సంస్థానాధీశుడు రథ నిర్మాణానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తారు. ఆయన ఆదేశాల మేరకు ఆలయ ప్రధాన పూజారి దారు వృక్షాలను 1,072 ముక్కలుగా ఖండిరచి పూరికి తరలిస్తారు. అక్కడ వాటిని రథ(Rath) నిర్మాణం కోసం 2,188 ముక్కలుగా చేస్తారు. 832 ముక్కలను జగన్నాథుడి రథానికి వినియోగిస్తారు. బలరాముడి రథానికి 763 ముక్కలు, సుభద్ర రథాన్ని 593 ముక్కలను వాడుతారు. అక్షయ తృతీయ(Akshaya Tritiya)నాడు రథాల నిర్మాణం ప్రారంభిస్తారు. ఇందులో తొమ్మిది మంది ముఖ్య శిల్పులు, 125 మంది సహాయకులు పాల్గొంటారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటికి రథాలను సిద్ధం చేస్తారు.
ప్రతి రథానికి 250 అడుగుల పొడువు, ఎనిమిది అంగుళాల మందం ఉండే తాళ్లను కడతారు. భక్తులు ఈ తాళ్లను లాగుతూ ముందుకు తీసుకువెళతారు. భక్తుల జయజయధ్వానాల మధ్య రథయాత్ర వైభవంగా సాగుతుంది.
జగన్నాథుడి రథాన్ని నంది ఘోష(Nandighosh rath) అని, బలభద్రుడి రథాన్ని తాళధ్వజ అని, సుభద్ర రథాన్ని దర్పదళ, పద్మ ధ్వజ అని పిలుస్తారు.
Puri Jagannath : రాజే సేవకుడు..
సాధారణంగా పాలకులు ఇతరులతో పనులు చేయిస్తారు. కానీ ఇక్కడ రాజే బంటుగా మారతాడు. పూరీ సంస్థానాధీశుడు స్వయంగా బంగారు చీపురు చేతబట్టి జగన్నాథుడు అధిరోహించే రథాన్ని శుభ్రం చేస్తారు. దీనిని చెరా పహరా(Chera Pahara)గా పిలుస్తారు.
Puri Jagannath : రోజూ కొత్త జెండా..
జగన్నాథ క్షేత్రంలోని ప్రధాన ఆలయ గోపురం ఎత్తు నలభై అయిదు అంతస్తుల భవనం. అంత ఎత్తున్న గోపురంపైకి ఎక్కి రోజూ జెండాను మార్చడం ఇక్కడ ఆనవాయితీ. ఇది వందల ఏళ్లుగా వస్తోంది. రోజూ పూజారి ఏ సాయం లేకుండా గోపురంపైకి ఎక్కి జెండాను మారుస్తారు.