Homeభక్తిKarthika Masam | కార్తీక మాసం విశిష్టత.. హరిహరాదుల అనుగ్రహం ఎలా పొందాలో తెలుసా?

Karthika Masam | కార్తీక మాసం విశిష్టత.. హరిహరాదుల అనుగ్రహం ఎలా పొందాలో తెలుసా?

కార్తీక మాసం అత్యంత విశిష్టమైనది. హరిహరులకు ప్రీతికరమైనది మాసం. ఈ నెలలో చేసే శివారాధన అపారమైన పుణ్యఫలాన్ని ఇస్తుంది.

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్ : Karthika Masam | దక్షిణాయణంలో అత్యంత విశిష్టమైనది, హరిహరులకు ప్రీతికరమైనది కార్తీక మాసం. ఉత్తరాయణంలో మాఘ మాసానికి ఎంతటి ప్రాధాన్యం ఉందో, ఈ మాసానికి అంతటి ప్రాముఖ్యత ఉంది. ఈ పుణ్య మాసంలో చేసే శివారాధన (Shivaraadhana) అపారమైన పుణ్యఫలాన్ని ఇస్తుంది.

Karthika Masam | కార్తీకంలో తప్పక చేయవలసినవి..

కార్తీక పురాణం (Karthika Puranam) ప్రకారం, ఈ మాసంలో సూర్యోదయానికి ముందు చేసే నదీ స్నానాలు, ఆ తర్వాత చేసే దానాలు, ఉపవాసాలకు గొప్ప శక్తి ఉంది.

దీపారాధన : ఇది పాపాలను తొలగించి పుణ్యఫలాన్ని ఇస్తుంది. ఆలయాల్లో, ఇళ్లలో దీపం వెలిగించడం ప్రధానం. కలియుగంలో నిత్యం చేయలేనివారు కూడా క్షీరాబ్ది ద్వాదశి నాడు దీపారాధన చేస్తే ఏడాది పొడవునా చేసిన ఫలితం లభిస్తుంది.

నువ్వుల నూనెతో (Sesame Oil) దీపం ఆయురారోగ్యాలు, కష్టాల నివారణకు, ఆవు నెయ్యి లక్ష్మీప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి.

శివారాధన , అభిషేకం : ప్రదోషకాలంలో శివారాధన అనంతకోటి పుణ్యఫలాలను ఇస్తుంది. కార్తీక సోమవారాలు అత్యంత పవిత్రమైనవిగా శివపురాణం చెబుతోంది. ఈ రోజుల్లో ఉపవాసం ఉండి, పంచామృతాలతో ఈశ్వరుడికి అభిషేకం చేయడం వల్ల హరిహరుల అనుగ్రహం లభిస్తుంది.

ఉపవాసం : ఉపవాసం ఆచరించడం వల్ల ఆరోగ్యం, దైవచింతన కలుగుతాయి.

Karthika Masam | కార్తీకంలో ముఖ్యమైన పండుగలు..

కార్తీక శుక్ల పాడ్యమి : బలి పాడ్యమి రోజున బలి చక్రవర్తిని స్మరించడం వల్ల కీర్తి, యశస్సు కలుగుతాయి.

కార్తీక శుద్ధ విదియ : భగినీహస్త భోజనం (Bhaginihastha Bhojanam) రోజున సోదరి ఇంట్లో భోజనం చేసి, కానుకలు ఇవ్వడం. పురుషులకు ఆయురారోగ్య ఐశ్వర్యం, ఆడపిల్లలకు సౌభాగ్యం కలుగుతాయి.

చవితి : నాగుల చవితి రోజున నాగ దేవత, సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని పూజించడం వల్ల కుజ, రాహుకేతు, కాలసర్ప దోషాలు తొలగుతాయి.

కార్తీక శుక్ల ఏకాదశి : ప్రబోధినీ ఏకాదశి రోజున శివ, విష్ణు ఆరాధన, సత్యనారాయణ వ్రతం ఫలప్రదం. ఈ రోజుతో చాతుర్మాస్య వ్రతాలు పూర్తవుతాయి.

కార్తీక శుక్ల ద్వాదశి : క్షీరాబ్ది ద్వాదశి (చిలుకు ద్వాదశి) రోజున తులసి (లక్ష్మి), ఉసిరి (మహా విష్ణువు) పూజ, దీపారాధన అత్యంత విశేషమైనది.

కార్తీక పౌర్ణమి : కార్తీక పౌర్ణమి (Kartika Purnima) శివాలయంలో అభిషేకం చేసి, శివారాధనతో పాటు జ్వాలా తోరణం దర్శనం చేసుకోవాలి.

ఈ పుణ్య మాసంలో ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాలను ఆచరించి, హరిహరుల అనుగ్రహాన్ని పొందవచ్చు.