Homeజిల్లాలుకామారెడ్డిIntermediate Education | ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ అడ్మిషన్లకు ప్రత్యేక డ్రైవ్

Intermediate Education | ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ అడ్మిషన్లకు ప్రత్యేక డ్రైవ్

గాంధారి ప్రభుత్వ జూనియర్​ కళాశాలో ఇంటర్​ అడ్మిషన్ల కోసం ప్రత్యేక డ్రైవ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు పాఠశాలలకు వెళ్లి ఇంటర్​ విద్యపై అవగాహన కల్పించారు.

- Advertisement -

అక్షరటుడే, గాంధారి/ఎల్లారెడ్డి: Intermediate Education | మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్​ కళాశాలలో (government junior colleges) ఇంటర్ ఫస్టియర్​లో అడ్మిషన్ల కోసం అధ్యాపకులు ప్రత్యేక డ్రైవ్​ చేపట్టారు. ఈ సందర్భంగా మండలంలోని పలు హైస్కూళ్లను ప్రత్యేక డ్రైవ్​లో (special drive) భాగంగా సందర్శించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్​ గడ్డం గంగారాం మాట్లాడుతూ.. ఇంటర్ కోర్సుల ప్రాధాన్యం, ప్రభుత్వ కళాశాలల్లో లభించే సదుపాయాలు, ఉచిత విద్య (free education), ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ వంటి ప్రముఖ సంస్థలతో ఉచిత ఆన్​లైన్​ తరగతుల వివరాలను ఆయన విద్యార్థులకు వెల్లడించారు. ఐఐటీ జేఈఈ మెయిన్స్ నీట్ క్లాసులు (IIT JEE Mains NEET classes), పాఠ్య పుస్తకాలు, స్కాలర్‌షిప్‌లు, ల్యాబ్ సదుపాయాలు వంటి అంశాలను విద్యార్థులకు వివరించారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అనుభవజ్ఞులైన అధ్యాపకులు బోధిస్తున్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తమ భవిష్యత్తును మెరుగుపర్చుకోవాలని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి హైస్కూల్‌కు వెళ్లి విద్యార్థులను ఇంటర్​ విద్యపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. 2026లో ఇంటర్ ఫస్టియర్​ అడ్మిషన్ల కోసం, తల్లిదండ్రులు, విద్యార్థులు సమీపంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలాలకే రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్లు ఎన్.లక్ష్మణ్, శ్రీధర్, జెట్టి విజయకుమార్, రమేష్, సంబాజి, సరిత, సుజాత పాల్గొన్నారు.

Must Read
Related News