అక్షరటుడే, వెబ్డెస్క్: CBSE Notification | నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. కేంద్రీయ విద్యాలయ సంఘటన (KVS)(Kendriya Vidyalaya Sanghatana), నవోదయ విద్యాలయ సమితి (NVS)(Navodaya Vidyalaya Samiti)లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర ప్రాథమిక విద్యా మండలి (CBSE) ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది పోస్టుల భర్తీకి నేడు సీబీఎస్‌ఈ షార్ట్ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది.
ఈ రిక్రూట్మెంట్లో భాగంగా మొత్తం 12,799 పోస్టులు భర్తీ చేయనుంది. ఇందులో KVSలో 9,156, NVSలో 3,643 పోస్టులు ఉన్నాయి. వీటిలో ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పీజీ టీచర్స్ (PGT), ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGT), ప్రైమరీ టీచర్స్ (PRT), స్టెనోగ్రాఫర్, లైబ్రేరియన్ లాంటి టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు (teaching and non-teaching posts) మంజూరు చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తులను నవంబర్ 14 నుంచి డిసెంబర్ 4 వరకు సమర్పించడానికి అవకాశం కల్పించింది. ఇక పరీక్షలు 2026 జనవరి, ఫిబ్రవరి నెల్లలో నిర్వహించే ఛాన్స్ ఉంది. అప్లికేషన్ ఫీజు జనరల్ లేదా ఓబీసీలకు రూ. 1,000 – 1,500 (పోస్ట్ ఆధారంగా), ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీకి మినహాయింపు ఇవ్వనుంది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
