అక్షర టుడే, వెబ్‌డెస్క్: Sriram Sagar | శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో (Sriramsagar Project) బుధవారం ప్రత్యేక శుభ్రత కార్యక్రమం చేపట్టారు. గోదావరి నది యాజమాన్య బోర్డు ఛైర్మన్ బీపీ పాండే (Godavari River Management Board Chairman BP Pandey) హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రాజెక్ట్ పరిసరాలు శుభ్రంగా, పర్యావరణ హితంగా మార్చేందుకు ఈ ప్రత్యేక శుభ్రత కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో బోర్డు సభ్యులు పవర్ ఆర్‌ఎం రంగరాజన్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు ఎం వేణుగోపాల్, సి పద్మిణి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శర్మిలా మొహమ్మద్, ఎస్సారెస్పీ ఈఈ చక్రపాణి, డీఈఈ సుకుమార్, సురేష్, ఏఈఈలు పాల్గొన్నారు.