అక్షరటుడే ఇందూరు: TGSRTC | రాఖీ పౌర్ణమి(Rakhi pournami), వరలక్ష్మి వ్రతం (varalaxmi Vratham) పండుగల నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి ఉమ్మడి జిల్లాకు ప్రత్యేక బస్సులు ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ (RTC Nizamabad Region) ఆర్ఎం జ్యోత్స్న తెలిపారు.
ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు సికింద్రాబాద్ (Secunderabad) నుంచి నిజామాబాద్, ఆర్మూర్, బాన్సువాడ (banswada), కామారెడ్డి, బోధన్‌కు రెగ్యులర్ బస్సులతో పాటు అదనపు బస్సులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఆర్మూర్‌కు 20, బోధన్‌కు 31, నిజామాబాద్‌కు 35, బాన్సువాడకు 19, కామారెడ్డికి 44 బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. కావున ప్రయాణికులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.