అక్షరటుడే ఇందూరు: భూపాలపల్లి, కాళేశ్వరంలో ఈనెల 15 నుంచి ప్రారంభమయ్యే సరస్వతి నది(Saraswati Pushkaraalu) పుష్కరాలకు నిజామాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు రీజినల్ మేనేజర్ జ్యోత్స్న తెలిపారు. ఆర్మూర్, బోధన్ నిజామాబాద్, బాన్సువాడ, కామారెడ్డి నుంచి నేరుగా పుష్కర ఘాట్ల వరకు ఆర్టీసీ బస్సులు వెళ్తాయని పేర్కొన్నారు. ఎటువంటి డిపాజిట్ లేకుండానే ముందస్తుగా బస్సులను కూడా బుక్ చేసుకునే అవకాశం కల్పించామన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పుణ్యస్నానాలు ఆచరించాలని కోరారు.
Saraswati Nadi Pushkaraalu | సరస్వతి నది పుష్కరాలకు ప్రత్యేక బస్సులు
Published on
