Homeజిల్లాలునిజామాబాద్​Limbadri Gutta | లింబాద్రిగుట్ట జాతరకు ప్రత్యేక బస్సులు

Limbadri Gutta | లింబాద్రిగుట్ట జాతరకు ప్రత్యేక బస్సులు

లింబాద్రి గుట్లపై లక్ష్మీనృసింహుని బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్మూర్​ ఆర్టీసీ డీఎం రవికుమార్​ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు.

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్: Limbadri Gutta | భీమ్​గల్​లోని శ్రీమన్నింబాచల క్షేత్రం లింబాద్రిగుట్టపై (Limbadri Gutta) బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. అయితే భక్తులు వేలసంఖ్యలో బ్రహ్మోత్సవాలకు (Brahmotsavams) తరలివస్తున్నారు.

ఈ సందర్భంగా ఆర్మూర్​ డిపో నుంచి నృసింహస్వామి ఆలయం లింబాద్రిగుట్టకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్మూర్​ డిపో మేనేజర్​ రవికుమార్​ (Armoor Depot Manager Ravi Kumar) పేర్కొన్నారు. బుధవారం నుంచి ఈనెల 7వ తేదీ వరకు బస్సులు నడుపుతున్నట్లు ఆయన తెలిపారు. పెద్దలకు రూ.60, పిల్లలకు రూ.40 ఛార్జీ ఉంటుందని వెల్లడించారు. ఆర్మూర్ పట్టణ, పరిసర ప్రాంత ప్రజలు జాతర ప్రత్యేక బస్సులను సద్వినియోగం చేసుకోవాలని డీఎం కోరారు.