అక్షరటుడే, ఆర్మూర్: RTC Special Bus | ఆర్మూర్ డిపో నుంచి యాదగిరిగుట్ట, స్వర్ణగిరి తీర్థయాత్రలకు ప్రత్యేక బస్సు అందుబాటులో ఉంచినట్లు డీఎం రవికుమార్ తెలిపారు. ఈనెల 27న ప్రత్యేకంగా ప్రయాణికుల కోసం 36 మంది సీటింగ్ కెపాసిటీతో ఉదయం 6 గంటలకు బస్టాండ్ నుంచి బస్సు బయలుదేరుతుందన్నారు. 10 గంటలకు యాదగిరిగుట్ట(Yadagiri gutta) చేరుకుని, అక్కడ దర్శనం, భోజనాంతరం 2 గంటలకు స్వర్ణగిరి (Swarna Giri)), దర్శనం. అనంతరం 6 గంటలకు బస్సు బయలుదేరి రాత్రి 10 గంటలకు ఆర్మూర్‌కు చేరుకుంటుందని పేర్కొన్నారు. ఒక్కొక్కరికి ప్రయాణ ఛార్జీలు రూ.1500 ఉంటుందని, ఈ అవకాశాన్ని ఆర్మూర్, పరిసర ప్రాంత భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
