అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Warangal | వరంగల్ జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఎస్సై హఫీజ్(Special Branch SI Hafeez) ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాలతో ఆయన పురుగుల మందు తాగగా.. చికిత్స పొందుతూ మరణించాడు.
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి ఎండీ హఫీజ్ ఉద్దీన్ (58) స్పెషల్ బ్రాంచ్‌లో ఎస్సైగా పని చేస్తున్నాడు. ప్రస్తుతం ఖానాపురం, చెన్నారావుపేట మండలాల్లో క్షేత్రస్థాయి అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే కుమార్తె, అల్లుడి వేధింపుల కారణంగా ఆయన శుక్రవారం రాత్రి తన ఇంట్లో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హఫీజ్ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Warangal | కలవరపెడుతున్న ఆత్మహత్యలు
పోలీస్ శాఖలో విధులు నిర్వహించే ధైర్యంగా ఉంటారు. అయితే ఇటీవల ఆ శాఖలో సిబ్బంది ఆత్మహత్య చేసుకుంటుండటం ఖాకీలను కలవరపెడుతోంది. ఇతరులు సూసైడ్ అటెంప్ట్ చేస్తే కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన పోలీసులే మనోధైర్యం కోల్పోయి తనువు చాలిస్తున్నారు. ఇటీవల సూర్యాపేట (Suryapet) జిల్లాలోని నాగారం పోలీస్ స్టేషన్లో ఎస్బీ ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ గౌడ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలే ఇందుకు కారణమని సమాచారం. ఖమ్మం జిల్లాలో ఓ కానిస్టేబుల్ ఆగస్ట్‌లో బలవన్మరణానికి పాల్పడ్డాడు.
