Homeజిల్లాలుకామారెడ్డిPolice Transfers | స్పెషల్ బ్రాంచ్ సీఐ బదిలీ.. ఉత్తర్వులు జారీ చేసిన ఐజీ

Police Transfers | స్పెషల్ బ్రాంచ్ సీఐ బదిలీ.. ఉత్తర్వులు జారీ చేసిన ఐజీ

స్పెషల్​ బ్రాంచ్​ సీఐ అశోక్​ బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆదివారం మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Police Transfers | కామారెడ్డి స్పెషల్ బ్రాంచ్ (Kamareddy Special Branch) సీఐ తుల శ్రీధర్ బదిలీ అయ్యారు. ఆయనను బాన్సువాడ సీఐగా (Banswada CI) బదిలీ చేస్తూ మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

బాన్సువాడ సీఐగా విధులు నిర్వర్తిస్తున్న అశోక్​ను ఐజీ కార్యాలయంలో (IG office) రిపోర్ట్ చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని పేర్కొన్నారు.